పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 277 P.pdf/152

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

2. తిరుసభ విశ్వాసం

తిరుసభ విశ్వాసం ఏలా ప్రారంభమైంది? ఉత్థాన క్రీస్తు చాలసార్లు శిష్యులకు కన్పించి వాళ్ళ విశ్వాసాన్ని బలపరచాడు. ఆత్మకూడ వారిమీదికి దిగివచ్చింది. ఫలితంగా శిష్యులు తాము పోగొట్టుకొన్న విశ్వాసాన్ని మల్లా పొంది భక్త్యావేశంతో క్రీస్తునిగూర్చి బోధించడం మొదలెట్టారు. ఆత్మదిగివచ్చిన దినాన్నేపేత్రు యెరూషలేములోని యూదులకు బోధించాడు. హృదయ పరివర్తనం చెంది క్రీస్తులోనికి జ్ఞానస్నానం పొంది పాపపరిహారాన్నీ పవిత్రాత్మనీ స్వీకరించండని వారిని హెచ్చరించాడు. ఆ రోజే మూడువేలమంది ప్రభుని విశ్వసించి అతని శిష్యులయ్యారు - అచ 2.41. ఆ రోజే తిరుసభ విశ్వాసం ప్రారంభమైంది.

తొలినాటి క్రైస్తవులు ఏమి నమ్మారు? శిష్యులు క్రీస్తునిగూర్చి చేసిన బోధను నమ్మడమే ఆదిమ క్రైస్తవుల విశ్వాసం. ఆ బోధ సంగ్రహంగా యిది. తండ్రి క్రీస్తుని మెస్సియాగ పంపాడు, యూదులు అతన్ని సిలువ వేసారు. కాని తండ్రి అతన్ని మరణంనుండి లేపాడు. యేసు మరడోత్థానాలద్వారా మనకు పాపపరిహారం జరిగింది. ఇప్పడు క్రీస్తుని విశ్వసించి అతనిలోనికి జ్ఞానస్నానం పొందితే మనకు రక్షణం కలుగుతుంది. ఈ బోధే సువిశేషసందేశం ఐంది. పేత్రు పౌలు ఈ సందేశాన్ని బోధించారు. ప్రజలుకూడ ఈ సందేశాన్ని కేవలం నరుల వాక్యంగాగాక దేవుని వాక్యంగా స్వీకరించారు. ඡoඨිෂ්o భక్తుల హృదయాల్లో విశ్వాసం పుట్టించింది - 1 తెస్ప 2,13. దానివల్ల వాళ్ళు తమ విగ్రహాలను విడనాడి సత్యమూర్తీ సజీవుడూ ఐన దేవుణ్ణి సేవిరచడానికి పూనుకొన్నారు - 1.9, క్రీస్తునందు దేవుని రక్షణ ప్రణాళిక నెరవేరిందని గుర్తించారు – అచ 13, 3233. జ్ఞానస్నానం పొంది తండ్రిని కుమారుని పవిత్రాత్మను విశ్వసించారు.

విశ్వాసుల జీవితం ఏలా వుండాలి? తిరుసభ విశ్వాసులు భక్తిశ్రద్ధలతో సిలువబలిలో పాల్గొనాలి - అచ 2,46-47. ప్రభువు విశ్వాసులను రక్షించేది ప్రధానంగా පොංඝසව්ඒඛී. విశ్వాసంతో జీవించేవాళ్ళు నైతిక జీవనం గడపాలి. దేవుని ఆజ్ఞలప్రకారం జీవించాలి. వేదవాక్యాన్ని విన్నంతమాత్రాన్నే చాలదు. అది తెలియజేసే ఆజ్ఞలప్రకారం జీవించి నరుడు దేవుని దీవెనలు పొందాలి - యాకో 1, 25. అబ్రాహాము అంతటివాడు దేవుని ఆజ్ఞప్రకారం ఈసాకుని బలియిూయడానికి పూనుకొన్న పిదపనేగాని నీతిమంతుడు కాలేదు - 1,31.

మన విశ్వాసం ప్రధానంగా సోదరప్రేమలో ప్రదర్శితంకావాలి. దేవుణ్ణి ప్రేమించేవాడు దేవునికి పోలికగావున్న తోడినరుణ్ణి గూడ అంగీకరించాలి. మనకు వుండి తోడివాళ్లు లేక బాధపడుతూంటే మనం వాళ్ళకు తప్పక సాయం చేయాలి - యాకో 2, 15.