పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 277 P.pdf/153

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

విశ్వాసంగలవాడు దేవుని కొరకు ప్రాణాలర్పించడానికిగూడ జంకడు, సైఫను ఆలాంటివాడు - అచ 8,59-60. క్రీస్తుకూడ తన తండ్రిపట్లగల విశ్వాసంతోనే చనిపోయాడు. అతడు తండ్రీ నా యాత్మను నీ చేతుల్లోకి అప్పగిస్తున్నాను అని చెప్పి మరణించాడు. ఆ ప్రభువే నేడు మనకు కూడ ఆదర్శం.

నేడు మనకు ప్రభువుపట్ల విశ్వాసం పట్టించేది ప్రధానంగా పవిత్రాత్మే ఆ యాత్మ అనుగ్రహంతోనే క్రీస్తుని దేవుణ్ణిగా అంగీకరిస్తాం - 1 కొ 12,3.

3. పౌలు యోహానుల విశ్వాసం

నూతనవేదంలో పౌలు విశ్వాసాన్ని గూర్చి కొన్ని ప్రత్యేకాంశాలు చెప్పాడు. అతని భావాలు సంగ్రహంగా ఇవి.

క్రీస్తు వచ్చిందాకా మోషే ధర్మశాస్త్రం యూదులను రక్షించింది. కాని క్రీస్తు వచ్చాక ఇక ధర్మశాస్త్రం ప్రజలను రక్షించదు. క్రీస్తు మరణోత్థానాలే మనలను రక్షిస్తాయి. కనుక ఇప్పడు మనం క్రీస్తుని విశ్వసించి మోక్షం పొందాలి. నరుడు ఏసుక్రీస్తునందలి విశ్వాసంద్వారా నీతిమంతుడౌతాడు. ధర్మశాస్తాన్నిపాటించడంవల్ల కాదు - గత 2,16.

ప్రభువు రక్షణాన్ని పొందడానికి పాపపు నరులమైన మనకు ఏ అర్హత్రాలేదు. ప్రభువు దాన్ని మనకు ఉచితంగా దయచేయవలసిందే. మన తరఫున మనం కృషిచేయాలి. పుణ్యకార్యాలు సాధించాలి, కాని మన పుణ్యకార్యాలే మనలను రక్షించవు. అవి మన కృతజ్ఞతను తెలియజేస్తాయి. దేవుని రక్షణానికి మనం తెల్చుకొనే ధన్యవాదాన్నిసూచిస్తాయి. మన రక్షణంమాత్రం ఉచితంగా, అనగా కేవలం దేవుని దయ వలన లభించవలసిందే. క్రీస్తు, మరడోత్థానాల వల్ల లభించవలసిందే. కనుక ఏ నరుడూ నా పుణ్యక్రియల వల్లనే నేను నీతిమంతుజ్ఞయ్యానని గర్వించకూడదు.

పౌలులాగే యోహానుకూడ విశ్వాసాన్ని గూర్చి కొన్ని ప్రత్యేకాంశాలు చెప్పాడు. అతని భావాలు ఇవి. క్రీస్తుని విశ్వసించేవాణ్ణి దేవుడు ఖండించడు -524 విశ్వసించనివాణ్ణి ఖండిస్తాడు - 3,18. క్రీస్తుని విశ్వసించేవాడు నిత్యజీవం పొందినట్లే - 3,16. ప్రభుని నమ్మేవాడు వెలుగులో నడుస్తాడు - 12, 46.

యూదుల ప్రధానమైన తప్ప క్రీస్తుని విశ్వసించక పోవడమే. అతని అద్భుతాలు చూచికూడ అతన్ని బుద్ధిపూర్వకంగా నిరాకరించడమే - 15,24-25.

యోహాను దృష్టిలో నరులు క్రీస్తని నమ్మడమే ప్రధానమైన విశ్వాసం. ఇందుకోసమే అతడు సువిశేషాన్ని వ్రాసాడు. ప్రజలు యేసు దేవుని కుమారుడని విశ్వసించి ఆ విశ్వాసంద్వారా రక్షణాన్ని పొందడానికే నేనీ గ్రంథాన్ని వ్రాసానని చెప్పకొన్నాడు - 20,31 కనుక మన శ్రద్ధ ఎప్పుడుగూడ క్రీస్తుమీదనే కేంద్రీకృతమై వుండాలి.