పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 277 P.pdf/151

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

2. నూత్నవేదం -

1. క్రీస్తుపట్ల విశ్వాసం

చాలమంది క్రీస్తుబోధలు విన్నారు. అతని అద్భుతాలు చూచారు. కాని కొద్దిమంది మాత్రమే అతన్ని విశ్వసించారు. ఆలా విశ్వసించినవాళ్ళే అతనికి శిష్యులయ్యారు. యోహానులాంటి భక్తుడే క్రీస్తే మెస్సీయా అని నిస్సందేహంగా విశ్వసించలేకపోయాడు. కనుక శిష్యులను పంపి రాబోయేవాడివి నీవేనా అని అడిగించాడు - మత్త 11,8. పరిసయులు క్రీస్తుని అసలే విశ్వసించలేదు. వాళ్ల క్రీస్తు దయ్యాలకు నాయకుడైన బెల్డెబూలు సహాయంతో అద్భుతాలు చేస్తున్నాడని నిందించారు - 12,24

కాని కొద్దిమంది మాత్రం క్రీస్తుని పూర్తిగా విశ్వసించారు. వారిలో శిష్యులు ముఖ్యలు, వారి నాయకుడైన పేత్రు యేసే మెస్సియా అని రూఢిగా ప్రకటించాడు - మత్త 16,16. వాళ్ళంతా క్రీస్తు చుట్టు పోగయ్యారు. వీళ్లే నూత్మవేదం లోని మొదటి విశ్వాసబృందం. పూర్వవేదం పేర్కొన్న శేషజనాన్నీ దీనులవర్గాన్నీ గుర్తుకుతెచ్చేది వీళ్ళే వీళ్ళల్లో క్రీస్తుతల్లి మరియు అగ్రగణ్య ఆమె ప్రభువు తన దాసురాలి దీనత్వాన్ని కటాక్షీంచాడు అని వినయంగా చెప్పకొంది - లూకా 1,43.

క్రీస్తు యావే సేవకుడు. అతడు తండ్రి ఆజ్ఞలను పాటించి సిలువమీద అసువులు పాయడానికి యెరూషలేమకి అభిముఖుడైపోయాడు - లూకా 9, 51. ఆ నగరంలో చనిపోయి అతడు తన్ను నమ్మేవాళ్ళ విశ్వాసానికి పరిపూర్ణత నిచ్చాడు - హెబ్రే 12,2.

శిష్యబృందం క్రీస్తుని విశ్వసించినా వారి శ్రద్ధ అచంచలమైంది కాదు. అతని సిలువ మరణాన్నివాళ్ళ అంగీకరించలేదు, పేత్రు సిలువమరణం క్రీస్తుకి దూరం కావాలనే కోరుకొన్నాడు - మత్త 16,22.

ప్రభువు పేత్రు విశ్వాసం దృఢంగా వుండాలని అతని కోసం ప్రత్యేకంగా ప్రార్ధనం చేసాడు - లూకా 22,32. ఐనా యితర శిష్యులతోపాటు అతడు కూడ ప్రభుని ఎరుగనని బొంకాడు. అతని విశ్వాసంకూడ చలించింది. ప్రభువు శత్రువుల చేతికి చిక్కినపుడు శిష్యులందరూ అతన్ని విడనాడి పారిపోయారు - మత్త 26, 56.

కాని ప్రభువు ఉత్థానానంతరం, విశేషంగా ఆత్మ దిగివచ్చాక వాళ్ళ విశ్వాసం బలపడింది.