పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 277 P.pdf/150

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఈ భక్త బృందానికి యూదులకులేని విశ్వాసం వుంటుంది. ఈ భక్త సమాజం నూత్నవేదంలో రాబోయే తిరుసభను సూచిస్తుంది. ఆ సభలో ఆదిమ సభ్యులైన క్రీస్తు, మరియమాత, శిష్యులు మొదలైన వాళ్ళనందరినీ సూచిస్తుంది.

5. జ్ఞానులు మొదలైనవాళ్ళ విశ్వాసం

పూర్వవేదాంతకాలంలో జ్ఞానులు యూదులకు బోధ చేసారు. వీళ్న వ్రాసినవే విజ్ఞానగ్రంథాలు. వీళ్ల కూడ ప్రజలకు విశ్వాసాన్ని బోధించారు. నీవు ప్రభుని నమ్మితే అతడే నిన్ను కాపాడతాడు అంటుంది సామెతల గ్రంథం 20,22. యోబు కష్టాల్లోగూడ ప్రభుని నమ్మాడు. నా విమోచకుడు సజీవుడుగా పున్నాడు. అతడు కడన నన్ను సమర్ధించి తీరుతాడు అని ఆ భక్తుడు వాకొన్నాడు - 19,25.

కీర్తనల గ్రంథం నరుడు ప్రభుని నమ్మి జీవించాలని చాలసార్లు నొక్కిచెప్పంది.
కొందరు రథాలనూ గుర్రాలనూ నమ్ముకొన్నారు
మేమైతే ప్రభుని నమ్ముకొన్నాం - 20,7
ప్రభువే నాకు కాపరి, యిక యే కొదవా లేదు - 23,1
నన్ను నీ చేతుల్లోకి అప్పగించుకొంటున్నాను - 31,5
ప్రభువు తల్లి పక్షిలా నిన్ను తన రెక్కలతో కప్పతాడు
అతని రెక్కలక్రింద నీవు సురక్షితంగా వుండిపోతావు
అతడు నమ్మదగినవాడు - 91,4

క్రీస్తుపూర్వం రెండవ శతాబ్దంలో అంటియోకస్ ఎపిఫానిస్ అనే గ్రీకురాజు యూదులను క్రూరంగా హింసించాడు. వాళ్ళ యూదమతాన్ని విడనాడి గ్రీకుమతాన్ని అనుసరించాలని నిర్బంధం చేసాడు. ఈ వేదహింసల్లో ఎందరో యూదులు వేదసాక్షులుగా మరణించారు. ఒక తల్లీ ఆమె ఏడురు కుమారులూ ఒక్కరోజులోనే యూదమతం కోసం ప్రాణాలర్పించారు - 2మక్క 7. ఆలాగే ఎలియాసరు అనే వృదుడు మతంకోసం ప్రాణత్యాగం చేసాడు - 6, 18-31. ఈ భక్తులంతా దేవునిపట్ల అచంచల విశ్వాసాన్ని ప్రకటించినవాళ్లే వీళ్ళంతా పూర్వం ప్రవక్తలు పేర్కొన్న శేషజానానికి చెందినఫాళ్లే.

పూర్వవేదకాలంలో కొందరు అన్యజాతి ప్రజలుకూడ యూదమతంలో చేరిపోయారు. పూర్వం వాళ్ళ కొలిచే దేవుళ్ళను విడనాడి యావేప్రభువుని పూజించారు. ఎలీషా ప్రవక్తనుండి కుష్టవ్యాధిని నయంచేయించుకొన్న నామాను ఈలాంటివాడు - 2 రాజు 5. యోనా ప్రవక్త బోధలు విని పశ్చాత్తాపపడిన నీనివే పౌరులు ఈలాంటివాళ్లు - 84 యూదితు విజయాన్ని చూచి యూదసమాజంలో చేరిన అమ్మోనీయుడు అరియోకు ఈలాంటివాడు - 14, 10. వీళ్ళందరూ ప్రభువుపట్ల గాఢమైన విశ్వాసాన్ని ప్రదర్శించినవాళ్ళే.