పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 277 P.pdf/146

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

8. విశ్వాసం

                                                                                                         బైబులు భాష్యం - 107

విషయ సూచిక

1. విశ్వాసాన్ని గూర్చిన బైబులు బోధలు

  • . పూర్వవేదం
  • . నూత్నవేదం

2. విశ్వాస స్వరూపం

  • . విశ్వాసం అంటే యేమిటి?
  • . విశ్వాస ఫలితాలు
  • . విశ్వాసాన్ని పెంచుకోవడం ఏలా?

మనవిమాట

విశ్వాసం, నిరీక్షణం, దైవప్రేమ అనేవి దైవపుణ్యాలు. రోజువారి క్రైస్తవ జీవితంలో విశ్వాసానికున్న ప్రాముఖ్యం అంతాయింతాకాదు. ఆదిలేందే భక్తీ లేదు, మతాచరణమూ లేదు.

ఇంత ప్రముఖమైన పుణ్యమైనా విశ్వాసాన్ని అర్థంచేసి కోవండ ఎంతమాత్రం సులభంకాదు, దాన్నిగూర్చి ప్రజలకు బోధించడంగూడ ఎంతమాత్రం తేలికకాదు.

ఈ సంచికలో విశ్వాసాన్ని సులువైన పద్ధతిలో వివరించే ప్రయత్నంచేసాం. మొదటి భాగంలో బైబులరీత్యా విశ్వాసమంటే యేమిటో తెలియజేసాం. రెండవ దానిలో దైవశాస్త్రరీత్యా విశ్వాశమంటే యేమిటో వివరించాం.

1. విశ్వాసాన్ని గూర్చిన బైబులు బోధలు

1. పూర్వవేదం

1. అబ్రాహాము విశ్వాసం

(ఈ వ్యాసంలో విశ్వాసం, శ్రద్ధ పర్యాయపదాలుగా వాడుతున్నాం.) అబ్రాహాము విశ్వాసానికి పెట్టింది పేరు. మూడు విడతల అతని శ్రద్ధ రుజువైంది. మొదటిసారి,