పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 277 P.pdf/142

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మన హృదయంలో చోటుచేసికొని వుండవు. ఈలాంటి పరిస్థితుల్లో మనలను సులభంగా గెలవవచ్చని దాని ఆలోచన.


17. పాపం

83. క్రీస్తు సిలువమీద వ్రేలాడ్డం జూచి మరియమాత ఎంతో బాధపడింది. కాని మనం క్రీస్తుకి ద్రోహంగా పాపం చేసేపుడు ఆమె యింకా అధికంగా బాధపడుతుంది.

84. ఇతరులు బలహీనతవల్ల పాపంలో పడిపోవడం చూస్తూంటాం. వారి దుష్టవర్తనం మనకు ఓ అద్దంలా వుపయోగపడాలి. ఆ యద్దంలోకి చూచుకొని మన బలహీనతలను మనం చక్కదిద్దుకోవాలి. లేకపోతే వాళ్ళకు పట్టినగతే మనకూ పడుతుంది.

18. పుణ్యం

85. యేసుసభ అధికారులు ఓ యువకుణ్ణి నోవిష్యేటు ముగించగానే పై చదువులకు రోమను కాలేజీకి పంపారు. కాని అతడు పుణ్యార్ధనం కంటె విద్యార్థనకు ఎక్కువ ప్రాముఖ్యం ఇచ్చాడు. పిశాచం అతన్ని బలంగా శోధించింది. ఆ శోధనకు తట్టుకోలేక అతడు వినయంగా దేవునికి ప్రార్థన చేసాడు. ఇగ్నేప్యస్ అప్పటికి పదేండ్లకు పూర్వమే చనిపోయాడు. అతడు మోక్షంనుండి ఈ యువకునికి దర్శన మిచ్చి "నీవు ఇక్కడికి వచ్చింది పాండిత్యాన్ని ఆర్థించడానికా లేక పుణ్యాన్ని ఆర్థించడానికా? అసలు నీవు ప్రపంచాన్ని వదలిపెట్టి దేవుని సేవలో చేరింది ఎందుకు? పుణ్యార్ధనం కొరకు ఎక్కువ కృష్మీ విద్యార్ధనం కొరకు తక్కువ కృషి చేయి బాగుపడతావు" అని మందలించాడు. ఈ హెచ్చరిక ప్రకారం ఆ యువకుడు తన ప్రవర్తనను మార్చుకొని భక్తి గల గురువుగా తయారయ్యాడు. తర్వాత జర్మనీకి అసిస్టెంటుగా పనిచేసి 1597లో చనిపోయాడు. చనిపోవడానికి మూడురోజులు ముందుగా అతడు ఈ వుదంతాన్ని వెల్లడిచేసాడు.

86. పుణ్యార్థనకు దగ్గరి మార్గం ఇది. లోకంలోని నరులు ఏ వస్తువులను గాఢంగా వాంఛిస్తారో వాటిని మనం పూర్తిగా అసహ్యించుకోవాలి, వాటికి మనం ఆమడదూరంలో వండాలి.

19. మాట్లాడేతీరు

87. మాట్లాడ్డంకంటె వినడం తేలిక, మనం తక్కువగా మాట్లాడాలి. ఎక్కువగా వినాలి.

88. వేనిస్ లో యేసుసభకు చెందిన ఓ యువగురువు ఓసారి హద్దుమీరి మాట్లాడి శ్రోతల మనస్సు నొప్పించాడు. ఇగ్నేప్యస్ అతన్ని కఠినంగా శిక్షించాడు. "ఇకమీదట నీ