పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 277 P.pdf/141

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అతనికి ప్రత్యేక రీతిలో పరిచర్యలు చేసే భాగ్యాన్ని దయచేయమని తండ్రీని మరియమాతనూ చాలసారులు అర్థించాడు. దారిలో అతడు రోముకి సమీపంలో వున్నలస్టోర్గా అనే గ్రామంలో ఓ పాడువడిన దేవాలయంలోకి ప్రవేశించి ప్రార్ధన చేసికొంటున్నాడు. ఆ దేవళంలో క్రీస్తు అతనికి తన సిలువతోను తండ్రితోను దర్శనమిచ్చాడు. ఆ దర్శనంలో తండ్రి కరుణతో ఇగ్నేప్యస్ వైపు చూచాడు. తన కుమారుడైన క్రీస్తుతో "నీవు ఇతన్నినీ సేవకునిగా స్వీకరించు " అని చెప్పాడు. క్రీస్తుకూడా అతనివైపు కరుణతో జూచి "నీవు నాకు సేవలు చేయి. నేను రోములో నీకు అండగా వుంటాను" అని చెప్పాడు. తర్వాత ఇగ్నేప్యస్ తన అనుచరులను కలసికొని వారికి ఈ దర్శన వృత్తాంతాన్ని తెలియజేసాడు. రోములో మన కొరకు ఏవో శ్రమలు కాచుకొని వున్నాయి. అక్కడ శత్రువులు మనలను సిలువచేయవచ్చు లేదా చంపవచ్చు. కాని అక్కడ క్రీస్తు మనకు తప్పక సహాయం చేస్తాడు. మన శత్రువుల బలం కంటె క్రీస్తు సహాయం గొప్పది. కనుక మనం నమ్మకంతో సంతోషంగా రోముకి వెళ్లాం అని అనుచరులతో చెప్పాడు.

80. పుణ్య పరిపూర్ణతను సాధించడానికి దగ్గరిమార్గం ఏమిటి అని ఓ గురువు అడగ్గా ఇగ్నేప్యస్ ఈలా చెప్పాడు, "క్రీస్తు కొరకు చాల శ్రమలను అనుభవించి అతన్ని గాఢంగా ప్రేమించడమే దగ్గరి మార్గం. దేవుని నుండి మనం ఈ యనుగ్రహాన్ని అడుగుకోవాలి. ఈ వొక్క భాగ్యంలో ఎన్నో అమూల్యమైన వరాలు ఇమిడి వున్నాయి. క్రీస్తు కొరకు చాల బాధలు అనుభవించినవారి హృదయంలో పరిపూర్ణమైన ఆనందం నెలకొని వుంటుంది. ఇతరానందాలు ఏవికూడ దీనికి సాటిరావు,

- 81. ఇగ్నేప్యస్ తన చివరి రోజుల్లో ఓమారు గాఢ భక్తితో ప్రార్థన చేస్తున్నాడు. యేసుసభ సభ్యులు తండ్రీ! నీవు ఏ వరం కోసం ఇంత భక్తితో ప్రార్ధన చేస్తున్నావు అని అడిగారు. అతడు ఈలా జవాబు చెప్పాడు. "హింసలు ఏనాడూ మీకు దూరంగా వండకూడదని నేను దేవుని ప్రార్ధిస్తున్నాను. వాటివల్ల మీకు ఎంతో లాభం కలుగుతుంది. హింసలు మెండుగావుంటే మీరు సక్రమ మార్గంలో నడుస్తారు. అశ్రద్ధకూ సుఖభోగాలకూ లొంగకుండా భక్తిగా జీవిస్తారు"

16. ప్రలోభాలు

82. పిశాచం కొన్నిసార్లు మనలను తీవ్రంగా శోధిస్తుంది. అది తన శోధనలను విశేషంగా రాత్రికాలాన్ని ఎన్నుకొంటుంది. మనం ఎప్పడు మేల్కొంటామా అని కాచుకొని వుంటుంది. వేకువనే మెలకువరాగానే అది మనకు దుష్టాలోచనలు కలిగిస్తుంది. అప్పుడు మనం ఒంటరిగా వుంటాం. అప్పడే మేల్కొన్నాం గనుక ఇంకా దివ్యమైన భావాలేమీ