పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 277 P.pdf/140

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

74 ఆధ్యాత్మిక మానవుడు శరీరానికంటె గూడ మనసును ఎక్కువగా అదుపులో వంచుకోవాలి. ఆంతరంగికమైన సంయమనంతో మనసును చెప్పచేతల్లో వుంచుకొంటాం. ఈ సంయమనాన్ని ఎప్పడూ పాటింపవలసిందే. ఇది అతి ముఖ్యమైంది. ఇక బాహిరమైన సంయమనంతో శరీరాన్ని అదుపులో వుంచుకొంటాం. ఇది అంత ముఖ్యమైందీకాదు, నిరంతరం పాటించవలసిందీ కాదు. ఆయా సందర్భాల్లో అవసరాన్నిబట్టిపాటించదగింది.

14. సిలువలు

75. లోకంవల్ల కలిగే ఆనందానికీ క్రీస్తు సిలువవల్ల కలిగే ఆనందానికీ ఓ వ్యత్యాసం వుంది. మొదటిది అనుభవించే కొದ್ದಿ అసహ్యం పుట్టిస్తుంది. రేండొది అనుభవించే కొద్దీ ఎక్కువ ఆనందాన్ని కలిగిస్తుంది.

76. అనారోగ్యం గూడ ఆరోగ్యమంతటి భాగ్యం. కనుక వ్యాధి బాధలను గూడ దేవుని వరంగానే భావించాలి.

15. హింసలు

77. ఇగేష్యస్ అల్కలా పట్టణంలో చెరలో వున్నపుడు ఉన్నత పదవుల్లో వున్నవాళ్లు కొందరు అతన్ని సందర్శించడానికి వచ్చారు. వాళ్లు అతన్ని శీఘ్రమే చెరనుండి విడిపిస్తామన్నారు. కాని అతడు వారికి వందనాలు చెప్పి వారి ప్రయత్నాన్ని విరమించుకోమన్నాడు. "ఎవని ప్రేమకొరకు నేను ఈ చెరలో బంధింపబడ్డానో అతడే అదను వచ్చినపుడు నన్ను ఈ సంకెలలనుండి విడిపిస్తాడు" అని చెప్పాడు,

78. సాలమంకాలో ఇగ్నేష్యస్ని బంధించి చెరలో వుంచారు. అతని అనుచరులను ఇద్దరిని గూడ బంధించి అదే చెరలో మరో గదిలో వుంచారు. ఓ రాత్రి ఆ చెరలోని ఖైదీలు గలాటాచేసి కారాగారం తలుపులు పగులగొట్టి తప్పించుకొని పోయారు, ఇగ్నేప్యస్ అనుచరులు కూడ ఆలా పారిపోయి వుండవచ్చు గాని పారిపోలేదు. అతడు నేర్పిన పాఠంవల్ల ప్రభావితులై వాళ్లు ఆలా చెరలోనే వుండిపోయారు. ఆ పాఠం ఇది. "క్రీస్తు కొరకు మనం అనుభవించే శ్రమలను దేవుడు దయచేసే అతి శ్రేష్టమైన వరాలనుగా గణ్ణించాలి"

79. ఇగ్నేష్యన్ తాను స్థాపించిన మఠసభను అధికార పూర్వకంగా అంగీకరించమని పాపగారిని అడగడానికి రోముకి వెళ్తున్నాడు. అతని అనుచరులు కూడ అతనివెంట పోతున్నారు. క్రీస్తు కుటుంబంలో ఓ సేవకుడుగా చేరే భాగ్యాన్ని తనకు దయచేయమని అతడు అప్పటికే చాలసారులు ప్రార్థన చేసాడు. క్రీస్తుకి చేరువలో వుండి