పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 277 P.pdf/138

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

- ఎల్లప్పడు నీ మానసిక స్వేచ్చను నిలబెట్టుకో. ఏ సంఘటనంగాని, ఏ వ్యక్తిగాని దాన్ని భంగపరచకూడదు.

- ఎవరితోను సులభంగా స్నేహం చేయవద్దు. ఇతరునితో స్నేహానికి పూనుకోకముందు నీ బుద్ధిశక్తి ఆ స్నేహాన్ని అనుమతిస్తుందో లేదో పరిశీలించి చూచుకో.

- నీ జీవితాన్నంతటినీ భక్తితో గడుపు. నరుల దృష్టిలో పిచ్చివాడివిగా కన్పించు. అప్పడు దేవుని దృషజ్ఞలో తెలివైనవాడిఔతావు.

65. సజ్జనుని లక్షణాలు ఇవి :

  • అతని తలంపులు ఉన్నంతగాను భక్తి మంతంగాను ఉంటాయి. అతడు తన్నుతానే నమ్మడు.
  • ఉత్తమునికి నిదానముంటుంది. అతడు వినయవంతుడుగా

ఉల్లాససపరుడుగా వుంటాడు.

  • మంచివాని పోకడలు వివేకవిజ్ఞానాలతోను మర్యాదతోను భక్తితోను నిండివుంటాయి.
  • సత్పురుషుని దుస్తులు శుభ్రంగా, తగినట్లుగా వుంటాయి.
  • అతడు మితభోజనాన్ని పాటిస్తాడు. సాధారణ భోజనంతో సంతృప్తి చెందుతాడు.
  • ఉత్తముడు మితంగా, తగినకాలంలో నిద్రిస్తాడు.
  • అతడు భక్తిశ్రద్ధలతో ప్రార్ధన చేస్తాడు. ఆ జపంలో విశ్వాసం నిరీక్షణం దేవప్రేమ వుంటాయి.

- అతడు ఏ పనినైనా దేవునితో ఐక్యమైగాని చేయడు.

12. ప్రార్ధనం

66. లోకంలోని నరులంతా ప్రపంచంలోని కారణాలన్నీ నిన్నేదైనా పని చేయమని కోరినా, దేవుణ్ణి సంప్రతించందే నీవా పని చేయవద్దు, మొదట దేవునికి ప్రార్ధనచేయందే ఏ ముఖ్యకార్యాన్నీ ప్రారంభించకూడదు. అతడు తండ్రులందరికంటె ఉత్తముడైన తండ్రి, మహాజ్ఞానియైన తండ్రి. కనుక మన నమ్మకమంతా అతనిమీదనే వుండాలి. అతడు మన కార్యాన్ని సఫలం చేయాలని వేడుకోవాలి.