పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 277 P.pdf/137

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

11. సన్యాస జీవితం

61. అది చలికాలం. ఇగేష్యస్ నిప్పుదగ్గర కూర్చుండి ప్రార్థన చేసికొంటున్నాడు. లొయోలా కోటలోని బంధువులనుండి అతనికి జాబులు వచ్చాయి. ఆ జాబులను వెంటనే ఇగ్నేప్యస్ కి ఇస్తే అతడు అమితానందం చెందుతాడన్న భావంతో ఇంటిలోపనిచేసే బ్రదరు వాటిని అతని దగ్గరికి తీసికొనిపోయాడు. కాని ఇగ్నేప్యస్ పరలోక సేవలో చేరినవాళ్లు ఇహలోక విషయాలతో కాలం వెళ్ళబుచ్చగూడదని బ్రదరుకి తెలియజేయగోరి, ఆ జాబుల కట్టను విప్పనైన విప్పకుండా అక్కడికక్కడే అగ్నిలో పడవేసాడు.

62. మరజీవితం గడిపేవాళ్ళ లోకం తమకు సిలువ వేయబడిందనీ, తాము లోకానికి సిలువ చేయబడ్డామనీ గ్రహించాలి. వాళ్లు తమ సొంత కోరికలను అవతలబెట్టి క్రీస్తుని ధరించిన నూత్నమానవులై యుండాలి. తమకుతాము చనిపోయి ధర్మంకొరకు జీవించేవాళ్ళయి ఉండాలి.

63. నిరంతరం మీ మనసును దేవుళ్ళను, దేవుణ్ణి మీ మనసులోను ఉంచుకోండి ఆ ప్రభువుని దప్పితే మరొకరిని గూర్చి ఆలోచించవద్దు. అతన్ని దప్పితే మరొకరిని ప్రేమించవద్దు, మీరుచేసే కార్యాలన్నీ అతని చిత్తాన్ని నెరవేర్చేవిగా వుండాలి. మీరు ఎప్పడూ అతన్ని గూర్చి మాట్లాడండి. మీ శ్రమలన్నిటిలోను అతన్ని దప్పితే మరో బహుమానాన్ని ఆశించకండి. క్రీస్తు జీవితాన్ని ఆదర్శంగా వుంచుకొని దాన్ని మీ జీవితంమీద ముద్రించుకోండి. మీరు అతనికి ప్రతిబింబాలుగా తయారుకండి.

64. ఆధ్యాత్మిక సూత్రాలు ఇవి :

- ఎవరికీ, చిన్నవారికికూడ ఎదురు చెప్పవద్దు.

- ఇతరునిమీద విజయాన్ని సాధించడంకంటె నీ తరపున నీవు లొంగి వుండడమే గొప్ప అని తలంచు.

- అన్ని విషయాల్లోను విధేయుడవై యుండు. ఇతరుని అభిప్రాయానికి లొంగు.

- ఇతరుల తప్పలనుగూర్చి ఆలోచించవద్దు. ఒకవేళ నీవు పరుల దోషాలను గమనిస్తే వాటిని దాచివుంచు.

- నీ తప్పలను మాత్రం బాగా తెలిసికో, అవి బహిర్గతం కావాలనికూడ కోరుకో

- నీవు ఏమితలంచినా ఏమి మాట్లాడినా ఏమిచేసినా, ఇది తోడివారికి ఉపయోగపడేదేనా, దేవునికి ప్రీతి కలిగించేదేనా అని ఆలోచించిచూడు.