పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 277 P.pdf/136

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆర్థించవచ్చు. ఈ సూత్రమంటే ఇగ్నేప్యస్కి ఇష్టం. అతడు స్వీయదేశమయిన స్పెయినుకి వెళ్ళినపుడు అక్కడి ప్రజలకు జ్ఞానోపదేశం బోధించగోరాడు. కాని అతని అన్నకు ఈ కార్యం యిష్టంలేదు. కనుక అతడు జనం రారు అని సాకులు చెప్పాడు, ఇగ్నేప్యస్ ఒక్కడు వచ్చినా చాలు, చిన్నపిల్లవాడు ఒక్కడు వచ్చినా నాకృషి విఫలంకాదు అని పల్కి పనికి పూనుకొన్నాడు.

55. ఇగ్నేప్యస్ తాను వ్రాసిన జాబులను మూడు నాల్గుసార్లు సవరించిన పిదపగాని పంపవలసిన వారికి పంపేవాడు కాదు. ఎవరైనా ఇతరులమీద నేరం తెస్తే వాళ్ళ ఫిర్యాదును కాగితంమీద వ్రాయించి సంతకం చేయించి తన దగ్గర వుంచుకొనేవాడు. అన్ని విషయాల్లోను జాగ్రత్తగా వుండడం అతనికి అలవాటు.

9. స్వీయబలం

56. మన హృదయంలో అలజడి వుండకూడదు. శాంతి, క్రమశిక్షణ నెలకొని వండాలి.చచ్చినవాడ్డి జీవంతో లేపడం కంటె మనలను మనం జయించడం గొపకార్యం.

57. ఒకసారి ఇగ్నేష్యన్ జబ్బుపడి వుండగా డాక్టరు అతనితో నీ హృదయంలోనుండి విచారకరమైన భావాలను పూర్తిగా తొలగించుకోవాలి అని చెప్పాడు. తనకు విచారం కలిగించే భావమేమిటా అని ఇగ్నేషియస్ ఆలోచించి చూడగా ఏమీతట్టలేదు. చివరకతడు తాను జీవితకాలమంతా శ్రమించి స్థాపించిన యేసుసభ నాశమైపోతే తనకు విచారం కలుగుతుంది కదా అనుకొన్నాడు. ఈ విచారం ఎంతసేపుంటుందని తన్నుతాను మల్లా ప్రశ్నించుకొన్నాడు. తనకు తాను ఈలా జవాబు చెప్పకొన్నాడు.యేసుసభ అంతా నాశమైపోయినా నేను పదిహేను నిముషాలు దేవునికి ప్రార్థన చేసికొంటేచాలు. మరల చిత్తశాంతిని పొందగలను.

10. పవిత్రత

58. కొద్దిపాటి పవిత్రతతోను మంచి ఆరోగ్యంతోను గొప్ప ప్రేషిత సేవ చేయవచ్చు. కాని కొద్దిపాటి ఆరోగ్యంతోను గొప్ప పవిత్రతతోను పెద్ద ప్రేషితసేవ చేయలేం.

59. బాగ ఆరోగ్యంగావుంటే ఇతరులకు ఎంతో సేవ చేయవచ్చు. అనారోగ్యంగా వుంటే ఏమి సేవ చేస్తాం?

60. తొలిరోజుల్లో పవిత్రులూ విద్వాంసులూ ఐన నరులు చాలమంది ఇగ్నేప్యస్ను చూచి యేసు సభలో చేరారు. అతడు మాట్లాడనక్కర లేకుండానే కేవలం అతని భక్తివల్లనే ఆకర్షితులై వాళ్ళ యేసుసభలో చేరారు.