పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 277 P.pdf/135

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

48. పెద్దలు ఆజ్ఞలు ఇచ్చేవాళ్ళ విధేయులు ఆజ్ఞలు పాటించేవాళ్ళు వివేకం ఆజ్ఞలు ఇచ్చే పెద్దల కుండాలి. ఆ యాజ్ఞలను పాటించే విధేయులకు వివేకం అక్కరలేదు. వాళ్ల పని మంచిచెడ్డలు ఆలోచించడం కాదు, పెద్దల ఆజ్ఞలను పాటించడం.

8. వివేకం

49. ఎక్కువ వివేకమూ తక్కువ పవిత్రతా కలవాళ్లు ఎక్కువ పవిత్రతా తక్కువ వివేకం కలవాళ్ళకంటె గొప్ప కార్యాలు సాధిస్తారు.

50. ఏదైనా పనిని చేపట్టకపూర్వం, అసలు ఏమిచేయాలో ముందుగా ఆలోచించుకోవాలి. పనినిచేసి ముగించాక దాన్ని ఏలా చేసామో పరిశీలించి చూచుకోవాలి. పనిని బాగా చేయడానికి ఈ రెండు సూత్రాలు వుపయోగపడతాయి.

51. మనం చేసే పనిని మొదట మన అంతరాత్మ అంగీకరించాలి. అటుపిమ్మట లోకులు దాన్ని తప్పక అంగీకరిస్తారు.

52. క్రియాశీలురు రెండు రకాలుగా వుంటారు. మొదటి రకంవాళ్లు ఇంటిని పడగొట్టకుండా కడతారు. వాళ్లు తమపని అందరికి ఉపయోగ పడేలాను ఎవరికీ హాని చేయకుండా వుండేలాను చూచుకొంటారు. తమ కార్యం ఎవరికైనా అసంతృప్తి కలిగిస్తే దాన్ని వెంటనే మానుకొంటారు. రెండవరకంవాళ్లు ఒకవైపు ఇంటిని పడగొడుతూ మరోవైపు కట్టబోతారు. వాళ్ళఒకవైపు బట్టను నేస్తూనే వుంటారు, మరోవైపు కోసివేస్తుంటారు. వారి ఆసక్తి మంచిదే గాని దానిలో ఉచితజ్ఞత ఉండదు. తమ పనివల్ల కలిగే చెడ్డను తామే గుర్తించరు. వీళ్ళు ఒక ఆత్మను రక్షింపబోయి పది ఆత్మలను నాశంజేస్తారు, ఇతరులు అడ్డువచ్చినా ఆగరు. ఇతరులతో విరోధాన్ని కొనితెచ్చుకొంటారు, తమ మఠసభలకుగూడ చెడ్డపేరు తెస్తారు.

53. ఆధ్యాత్మిక విషయాలమీద ప్రీతిలేనివారితో మెలిగేప్పడు మొదట వాళ్ళను లోకవిషయాలను గూర్చి మాట్లాడనీయాలి. కడన మనం పరలోక విషయాలనుగూర్చి మాటలాడాలి, ఎప్పుడు గూడ మనం ఇతరుని తలుపగుండా లోపల ప్రవేశించి మన తలుపగుండా బయటికి రావాలి.

54. "చిన్న కార్యాలను పట్టించుకోకుండా పెద్ద కార్యాలను మాత్రమే చేయాలనుకోవడం, వాటికొరకు వేచివుండ అవివేకం. పెద్ద కార్యాలు ఎపుడోగాని మన పాలబడవు. కాని చిన్నకార్యాలను చేసే అవకాశం ఎల్లపడూ మనకు లభిస్తూనేవుంటుంది. చిన్న కార్యాలు చాల తగులుతుంటాయి. కనుక వాటిని చేయడం వల్ల ఎంతో పుణ్యాన్ని