పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 277 P.pdf/10

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

5 ఆమూస

ప్రభువు ఎన్మిదవ శతాబ్దంలో ఆమోసును పిల్చాడు. ఇతడు చదువు సంధ్యలు లేని అనాగరికుడు. గొర్రెల మందలను కాచుకొంటూ అంజూరపు నారు పెంచుతూ బ్రతికేవాడు. ఐనా ప్రభువు ఈలాంటివాణ్ణి ప్రవక్తగా ఎన్నుకొన్నాడు. కనుక అతడు ప్రవచనం చెప్పడం ప్రారంభించాడు. ఆ ప్రవక్త తన అనుభవాన్ని ఈలా చెప్పకొన్నాడు. సింహం గర్జిస్తే ఎవరైనా భయపడకుండా వుంటారా? ప్రభువు ఆదేశిస్తే ఎవరైనా ప్రవచనం చెప్పకుండా వుంటారా? ప్రభువు తన భక్తులైన ప్రవక్తలకు ముందుగా తెలియజేయకుండా ఏకార్యమూ చేయడు" - ఆమో 7,14-15 : 3,7-8.

6. నూత్నవేద ప్రవక్తలు

పైన పూర్వవేద ప్రవక్తలను కొందరిని చూచాం. ఇక నూత్న వేద ప్రవక్తలు కూడ వున్నారు. తొలినాటి క్రైస్తవులకు యెరూషలేము ఒక కేంద్రంగాను అంతియొకయ మరియొక కేంద్రంగాను వుండేది. అగబు అనే ప్రవక్త యెరూషలేము నుండి అంతియొకయ కేంద్రానికి వచ్చి దేశమంతటా కరువు వస్తుందని ముందుగానే ప్రవచనం చెప్పాడు. అతడు చెప్పినట్లుగానే క్లాదియా చక్రవర్తి కాలంలో ఈ కాటకం సంభవించింది — అ చ 11,27-28.

తొలిరోజుల్లో క్రైస్తవ మతంలో చేరినవాళ్ళంతా యూదులు. అన్యజాతి జనులైన గ్రీకులు రోమనులు ఇంకా క్రైస్తవ మతాన్ని పుచ్చుకోలేదు. వాళ్లకు క్రీస్తుని బోధించవలసిన వాడు పౌలు. కనుక పరిశుద్ధాత్మ అంతియొకయ సమాజంలో వున్నప్రవక్తలను ప్రేరేపించి వాళ్ళచేత పౌలుని గూర్చి ప్రవచనం చెప్పించింది. వాళ్లు లేచి "నేను నియమించిన పనికై పౌలును బర్నబాను పంపండి" అని ప్రవచించారు. ఆ ప్రవచనానికి విధేయులై పౌలు బర్నబాలు అన్యజాతి జనులకు క్రీస్తుని బోధించడానికై బయలుదేరి వెళ్ళారు - అచ 13, 1-3.

పౌలు మూడు ప్రేషిత ప్రయాణాలు చేసి గ్రీసు రోమను రాజ్యాల్లో అన్యజాతి ప్రజలకు క్రీస్తుని బోధించాడు. అతడు మూడవ ప్రయాణంలో తూరు పట్టణంలో వుండగా అక్కడి విశ్వాసులు పౌలుకు యెరూషలేములో బాధలు కలుగుతాయని ప్రవచించారు. అక్కడికి వెళ్ళవద్దని అతన్ని హెచ్చరించారు - అ చ 21,4. కొంతకాలానికి పూర్వం అలాంటి హెచ్చరికనే మరికొందరు ప్రవక్తలు కూడ అతనికి విన్పించారు — అ చ 20,23.

పౌలు మూడవ ప్రేషిత ప్రయాణం ముగించి యెరూషలేము చేరకముందు కైసరియాలో ఫిలిప్ప అనే సువిశేష బోధకుని యింట బసచేసాడు. ఈ ఫిలిప్పకి నల్లురు 3