పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 277 P.pdf/11

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కుమార్తెలున్నారు. వాళ్లందరూ అవివాహితలూ, ప్రవచనం చెప్పేవాళ్ళ పౌలు అక్కడ బస చేస్తుండగానే యూదయా నుండి అగబు ప్రవక్త వచ్చాడు. అతడు పౌలు తోలు నడికట్టు తీసికొని తన కాళ్ళచేతులు బంధించుకొన్నాడు. "ఈ నడికట్ట ఎవరిదో అతనిని యూదులు యెరూషలేములో ఈలాగే బంధించి అన్యజాతి జనులకు అప్పగిస్తారు" అని ప్రవచనం చెప్పాడు. అతడు చెప్పినట్లుగానే తర్వాత యూదులు యెరూషలేములో పౌలుని బంధించారు — అ చ 218-11.

పై సంఘటనలు ప్రవక్తల పిలుపునీ వాళ్ళు చేసిన పనులనీ తెలియజేస్తాయి.

7. ప్రవక్త లక్షణాలు

ప్రవక్త అంటే చక్కగా మాట్లాడేవాడని వ్యత్పత్యర్థం. అనగా అతడు దేవుని తరపున ప్రజలతో మాట్లాడేవాడు. దేవుని సందేశాన్ని ప్రజలకు విన్పించేవాడు. దేవుని దూతగా, వార్తావహుడుగా వ్యవహరించేవాడు. "అప్పడు ప్రభువు దూతయైన హగ్గయి ప్రభువు సందేశాన్ని ప్రజలకు ఈలా విన్పించాడు : ప్రభువు నేను విమాకు తోడై యుంటాను అని పల్కుతున్నాడు" - హగ్ల 1,13. ఈ వాక్యంలో ప్రవక్త లక్షణాలన్నీ వున్నాయి. మామూలుగా ప్రవక్తలు చెప్పే వాక్యాలు ఈలాగే వుంటాయి.

యిర్మీయాకు ఓమారు కపట ప్రవక్తలతో వివాదం వచ్చింది. యథార్థమైన ప్రవక్త ఎవడు అన్న ప్రశ్న వచ్చింది. ప్రభువు వాక్యాన్ని స్వయంగా విన్నవాడే ప్రవక్తగాని ఎవడు పడితే వాడు కాదు అన్నాడు యిర్మీయా “ఈ ప్రవక్తల్లో ఎవడూ ప్రభువసభలో పాల్గొనలేదు. ఎవడు కూడ అతని వాక్యాన్ని వినలేదు, అర్థం చేసికోలేదు, ఆలించి చూడలేదు" అన్నాడతడు -యిర్మీ 23, 18, ఇక్కడ "ప్రభువు సభలో పాల్గొనడం" అంటే ఆ ప్రభువు విన్పించే సందేశాలను వినడం. ప్రభువు కొలువుదీర్చి భక్తులకు తన వాక్కును విన్పిస్తాడు. అనగా నిజమైన ప్రవక్తకు దేవుడు తన సందేశాన్ని తెలియజేస్తాడు. యిర్మీయా ప్రభువు వాక్కు ఈలా విన్నాడు. దేవుని వద్ద నుండి విన్న సందేశాన్ని తాను మళ్ళా ప్రజలకు విన్పించాడు. ప్రభువు ప్రవక్త హృదయంలోనే ఈ సందేశాన్ని విన్పిస్తాడు. కాని కపటి ప్రవక్తలు ఈలా దేవుని సందేశాన్ని వినరు. వాళ్ళ దేవుని కొలువులోకి రానేలేదు. కనుక వాళ్లు చెప్పేవి కేవలం వాళ్ల భావాలు మాత్రమే.

దేవుని సందేశాన్ని విన్పించడం ప్రవచనాని కుండే ముఖ్య లక్షణం, కాని వాళ్ళ ఈ దివ్య సందేశాన్ని ఏలా వినగలిగారు? ప్రవక్తలు పవిత్రాత్మచే ప్రేరితులై దేవుని సందేశాన్ని చెప్పారు - 2షేత్రు 1,21. ఆత్మశక్తి ప్రవక్తల్లో బలంగా పనిచేస్తుంది. ఆ శక్తితోనే వాళ్ళ ప్రవచనం చెప్పారు. కనుకనే ప్రవక్త చెప్పిన పలుకు నెరవేరి తీరేది.