పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 277 P.pdf/9

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

2. యెషయా

ఎన్మిదవ శతాబ్దంలో ప్రభువు యెషయాను పిల్చాడు. అతడు ఓ దినం సాయంకాలం దేవాలయానికి ఆరాధనకు వెళ్ళాడు. దేవళంలో అతనికి ప్రదర్శనం లభించింది. ప్రభువు రాజఠీవితో సింహాసనం విూద ఆసీనుడై వున్నాడు. అతని చుటూ దేవదూతలు కైవారం చేస్తూ "మా ప్రభువు పరిశుధుడు పరిశుధుడు పరిశుధుడు" అని గానం చేస్తున్నారు. యెషయా నా కంటితో ప్రభువుని దర్శించాను ఇక నేను నాశమైపోతానేమోనని భయపడ్డాడు. అప్పడు ఓ దేవదూత బలిపీఠం విూద కణకణమండే నిప్పకణికను తెచ్చి అతని పెదవులను కాల్చాడు. దానితో ప్రవక్త దోషం పరిహారమైంది, అతడు శుద్ధిని పొందాడు. అంతట ప్రభువు నా తరపున ప్రవక్తగా ఎవడు వెళ్లాడు అని ప్రశ్నింపగా యెషయా నేనున్నాను గదా నన్ను పంపమని ముందుకు వచ్చాడు. ఆ రీతిగా అతడు ప్రభువు ప్రవక్త అయ్యాడు = యొష 6, 1=8.

3. యిర్మీయా

ప్రభువు ఏడవ శతాబ్దంలో యిర్మీయాను పిల్చాడు. "నీవు మాతృగర్భంలో రూపొందక మునుపే నిన్ను గూర్చి నాకు తెలుసు. నీవు పట్టకమునుపే నిన్ను పవిత్రుణ్ణి చేసి జాతులకు ప్రవక్తగా నియమించాను" అన్నాడు. యిర్మీయా ప్రభూ! నేను పసివాడ్డి నాకు ఏలా మాట్లాడాలో తెలీదు. నీవు మరొకట్టి ఎన్నుకో అని వెనుకంజ వేసాడు. కాని ప్రభువు అతన్ని ప్రోత్సహించి "నేను పంపదలచుకొన్న వాళ్ళందరివద్దకు నీవు వెళ్లాలి. నీవు వాళ్ళకు భయపడవదు. నేను నీకు తోడై యుంటాను" అని చెప్పాడు. అటుపిమ్మట ప్రభువు తన వాక్కుని తీసి యిర్మీయా నోటిలో పెట్టాడు. దానితో అతడు ప్రభువు ప్రవక్త ఐపోయాడు - యిర్మీ 1,4-10. 4.

4 యెహెజ్కేలు

యెహెజ్కేలు ఓ దర్శనంలో ప్రభువు చేయిచాపి ఓ వ్రాతప్రతిని తన కందిస్తూండగా చూచాడు. ప్రవక్త ఆ గ్రంథాన్ని భుజించాలనీ అటుపిమ్మట యిస్రాయేలీయుల వద్దకు వెళ్ళి వాళ్ళకు బోధించాలనీ ప్రభువు ఆజ్ఞ యిచ్చాడు. దేవుడు చెప్పినట్లే ప్రవక్త ఆ పుస్తకాన్ని భక్షించాడు. అది అతని నోటికి తేనెలాగ తీయగా వుంది. ఆ గ్రంథ భక్షణంతో అతడు ప్రవక్త అయ్యాడు - యెహె2,8-3,3. ఈ దర్శనం భావం ఏమిటి? ప్రవక్త చెప్పే సందేశం అతనిది కాదు. అతడు మొదట దేవుని నుండి ఆ సందేశం వింటాడు. దాన్ని చక్కగా జీర్ణం చేసికొంటాడు. అటుపిమ్మట ప్రజల వద్దకు వెళ్ళి వాళ్ళకు ఆ సందేశాన్ని విన్పిస్తాడు. అనగా ప్రవక్త సొంత సందేశాన్ని కాక, దేవుని సందేశాన్ని విన్పించేవాడని భావం,