పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 276 P.pdf/99

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మూడవది, మనం క్రీస్తు కోసం తోడి నరుణ్ణి క్షమించాలి, క్రీస్తు మన వద్దనుండి ఈ విషయాన్ని అడుగుతూంటాడు. "నాకోసం నీ విరోధిని క్షమించ" మంటూంటాడు. మనం క్రీస్తును కాదనగలమా? పౌలు ఎఫెసీయులకు వ్రాస్తూ "ఒకరి యెడల ఒకరు దయచూపుతూ కరుణా హృదయులై వుండండి. దేవుడు క్రీస్తు నందు మిమ్మక్షమించాడు. అలాగే మీరూ ఒకరి నొకరు క్షమిస్తూండండి" అని హెచ్చరించాడు - 4,32 ఈ యాజ్ఞ నేడు మనకూ అక్షరాలా వర్తిస్తుంది.

ఓ జరుగకూడని పని జరిగినప్పడు మంచివాళ్ళ ఇక్కడ తప్ప నాదా కాదా అని కూడ విచారించకుండా, వెంటనే క్షమాపణం అడుగుతుంటారు. ఇది ఉత్తముల పద్ధతి. మనం క్షమాపణం అడిగినంత మాత్రాన తప్ప మనదే అని రుజువుకాదు. ఎదుటి వ్యక్తి హృదయం మాత్రం చల్లబడుతుంది. అంచేత దైనిక జీవితంలో ఈ పద్ధతి ననుసరించడం మంచిది.

క్షమాపణ గుణం అంత సులభంకాదని చాలాసార్లు చెప్పాం. విశేషంగా ఖండితమైన స్వభావంగల వాళ్లకు క్షమాపణం చాల కష్టమనిపిస్తుంది. ఐనా క్రైస్తవులు దీన్ని సాధించాలి. ఈ గుణాన్ని అలవరచుకొననివాళ్ళు తాము క్రీస్తు శిష్యులమని చెప్పకోడానికి అర్హులుకారు.

6. పౌలు బోధ

ప్రేమగీతం

మొదటి కొరింతీయుల జాబు 13వ అధ్యాయంలో పౌలు సోదరప్రేమను సవిస్తరంగా వర్ణించాడు. గ్రీకు మూలంలో ఈ యధ్యాయం వచనంలోనే వుంది. ఐనా ఓ గీతంలా నడుస్తుంది. నూత్నవేదం సోదరప్రేమనుగూర్చి చెప్పే ఘట్టాలన్నిటిలోను ఇది శ్రేష్టమైనది. కనుక క్రైస్తవభక్తుడు ఈ ప్రేమ గీతాన్ని జాగ్రత్తగా అవగాహనం చేసికొని భక్తితో మననం చేసికోవాలి.

సొలోమోను విజ్ఞాన గ్రంథం ఓతావలో విజ్ఞానాన్ని గూర్చి హృద్యంగా వర్ణించింది - 7, 22-30. పై విజ్ఞానగ్రంథ వాక్యాలు సోదర ప్రేమనుగూర్చి చెప్పడానికి పౌలుకి ప్రేరణం కలిగించి వుండవచ్చు. ప్రవచనంలో విజ్ఞానవాక్యం కూడ ఒకటి. పౌలుగీతం ఈలాంటి విజ్ఞానవాక్యమే. ఆ రోజుల్లో ఉల్లాసానికి, విందులు ఏర్పాటుచేసేవాళ్లు, ఆ విందులకు హాజరైన తాత్వికులు విజ్ఞానవంతమైన సంభాషణలు జరిపేవాళ్ళ ఉదాహరణకు ప్రపంచంలోకల్లా గొప్పదియేది, మంచిది యేది అని ఒకరు ప్రశ్నింపగా, మరొకరు జవాబు చెప్పేవాళ్ళ పాలు గీతం కూడ ఈలాంటి విజ్ఞాన సంభాషణంలాగే నడిచింది. 91