పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 276 P.pdf/98

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రార్థించాడు - లూకా 23–34. తన్ను ఎరుగనని ముమ్మారు బొంకిన పేత్రుని గూడా క్షమించి "నా గొర్రెలను మేపు" అని ఆదేశించాడు - యోహా 21-18. అనగా పేత్రు తన సమాజానికి అధిపతి కావాలని భావం - యోహా 21, 18. క్రీస్తు క్షమాపణ గుణాన్ని చక్కగా అర్థం చేసుకున్న తొలి వేదసాక్షి సైఫను కూడ తాను చనిపోయే సమయంలో శత్రువులను క్షమిస్తూ "ప్రభూ! ఈ పాపాన్నివీళ్ళమీద మోపవద్దు" అని ప్రార్థించాడు - అచ 7,60.

నరుడు దేవునికి పోలికగా కలిగింపబడినవాడు. అనగా అతడు దేవుని లాగ వుండాలి, దేవుని లాగ మెలగాలి, కాని ఈ దేవుడు క్షమాపరుడు. కనుక దేవుని పోలిన నరుడు కూడ ఇతరులను క్షమిస్తుండాలి. అందుకే లూకా సువార్త 6,36 “మీ తండ్రి లాగే మీరూ కనికరం చూపుతూండండి" అంటుంది. ఏమి కనికరం? ఇతరుల పట్ల దయ చూపడం. ఇతరుల అపరాధాలను క్షమిస్తుండడం. ఈ వాక్యాన్నే మత్తయిసువార్త "పరలోకంలోని మీ తండ్రి లాగే మీరూ పరిపూరులై యుండండి" అని నుడుపుతుంది - 5,48, ఏమి పరిపూర్ణత్వం? కనికరం చూపడం, క్షమించడం.


3. క్షమాపణ గుణాన్ని పాటించడం ఎలా?

మనం మూడుసార్లు క్షమాపణ గుణాన్నిగూర్చి ఆత్మ శోధనం చేసికొంటూండాలి. మొదటిది, రోజు రాత్రి నిద్రింపకముందు మన హృదయంలో ఎవరిపట్లనైన ద్వేషభావం వందేమోనని పరీక్షించి చూచుకోవాలి. నిద్ర మరణాన్ని సూచిస్తుంది. ద్వేషభావంతో చనిపోవడం మేలుకాదు - ఎఫె 4,26. రెండవది, క్రైస్తవ సంస్కారాలు పొందక ముందు, విశేషంగా దివ్యపూజకు ముందు గూడ - మత్త 5,23-24. అందుకే మనం పూజారంభంలో పాపాలు తలంచుకొని పశ్చాత్తాప పడేది. మూడవది, ప్రార్థనకు ముందు - మార్కు 11,25. ద్వేషంతో కూడిన హృదయం నుండి వెలువడే ప్రార్ధన దేవునికి ప్రియపడదు. ప్రభువు ఎప్పడైనా మన ప్రార్థనను ಆಲಿಂವಳವ್ಯನಿವ್ವತೆ అందుకు కారణం ఈ క్షమాగుణం లేకపోవడమే కావచ్చు.

ఇతరులను సులభంగా క్షమించడానికి ఉపకరించే భావాలు కూడా మూడున్నాయి. మొదటిది, లోకంలోని చెడు కార్యాలన్నీ దేవుని అనుమతి వల్లనే జరుగుతూంటాయి. క్రీస్తు "నా తండ్రి యిచ్చిన పాత్రను నేను త్రాగవలదా?" అన్నాడు. ఈ పాత్ర యథార్థంగా ఎవరిద్వారా వచ్చిందో, అనగా ఏ యూదప్రజలు తన్ను యథార్థంగా బాధించబోతూన్నారో క్రీస్తు అట్టే గణింపలేదు. మనకు ద్రోహంచేసే వాళ్ళపట్లగూడ మనం ఈలాంటి భావమే కలిగించుకోవడం మంచిది. రెండవది, మనకు ద్రోహంచేసిన నరుడు కూడ దేవుని బిద్దే అతన్ని మనసులో పెట్టకొనిగూడ దేవుడు లోకాన్ని ప్రేమించాడు, తన ఏకైక కుమారుని పంపించాడు. దేవుడు అతని నాశాన్నిగాక పరివర్తనాన్ని కోరుకుంటూంటాడు. మనం కూడ అతన్నిదేవుడు చూచే చూపుననే చూస్తూండాలి. కనుక అతనిపట్ల ద్వేషం కూడదు. 90