పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 276 P.pdf/100

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

1 కొ 13వ అధ్యాయాన్ని మూడు భాగాలుగా విభజించవచ్చు.
1) 1-3 సోదరప్రేమ విలువ
2) 4-7 సోదరప్రేమలోని 14 గుణాలు
3) 8-13 సోదరప్రేమ శాశ్వతమైంది.

మొదటి భాగం

సోదరప్రేమ విలువ –13,1-3

ప్రజల దృష్టినాకర్షించే వరాలు మూడున్నాయి. మొదటిది, భాషల్లో మాటలాడ్డం. ఇది దేవుని స్తుతించే వరం. ఆనాటి కొరింతుక్రైస్తవులు ఈ వరాన్ని ఘనంగా యెంచారు. కాని ప్రేమ లేకపోతే ఈ స్తుతివరానికి ఏ విలువా వుండదు. అది ఓ గంట శబ్దంలాగో లేక తాళాల శబ్దంలాగో రణగొణధ్వని మాత్రమే ఔతుంది.

రెండవది - ప్రవచనం, రహస్యాలు తెలసికొనడం, జ్ఞానం, అద్భుతాలుచేసే విశ్వాసం మొదలైన వరాలు కలిగి వుండడం. హృదయంలో సోదరప్రేమ లేకపోతే ఈ వరాలు కూడ పెద్దగా ఉపయోగపడవు.

మూడవది, ఆస్తిని పేదలకు పంచి యూయడం, శరీరత్యాగం మొదలైన సేవాకార్యాలు. కాని యీ సేవలను కేవలం కీర్తిప్రతిష్టల కొరకే చేయవచ్చు. సోదరప్రేమలేనికాడ ఈలాంటి సేవలు ఏమీ సాధించలేవు. కనుక పై భాషలకంటె, వరాలకంటి, సేవాకార్యాలకంటె సోదరప్రేమ గొప్పది.

రెండవ భాగం

సోదరప్రేమలోని 14 గుణాలు = 13, 4-7

పౌలు సోదరప్రేమలో కన్పించే లక్షణాలు 14 పేర్కొన్నాడు. వీటిని మూడు భాగాలు చేయవచ్చు. తొలి రెండు లక్షణాలు ప్రేమ ఏంచేస్తుందో చెప్తాయి. తరువాతి ఎన్మిది లక్షణాలు ప్రేమ ఏమి చేయదో చెప్తాయి. కడపటి నాలు లక్షణాలు మల్లా ప్రేమ ఏంచేస్తుందో చెప్తాయి. ఇక వీటిని క్రమంగా పరిశీలిద్దాం.

మొదట ప్రేమలో కన్పించే రెండు లక్షణాలు చెప్పాడు. దానిలో సహనమూ, దయూ వుంటాయి - 13,4.

1. ప్రేమలో సహనం వుంటుంది. ఏమి సహనం? ప్రేమగల నరుడు విరోధిమీద పగతీర్చుకో" కలిగిగూడ తీర్చుకోడు. భగవంతునిలోను ఈ గుణమేవుంటుంది. అతడు తన శత్రువులమీద ఆగ్రహం తెచ్చుకొని వాళ్ళను నాశం చేయాలి అనుకొంటాడు, కాని మళ్ళా ఓర్పుతో ఆయాగ్రహాన్ని అణచుకొంటాడు - రోమా 9,22. ప్రేమకల మానవుడుకూడ ఈ ప్రభువులాగే ప్రవర్తిస్తాడు. శత్రువులు తనకు కీడు చేసినా, బాధలు కలిగించినా.

92