పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 276 P.pdf/96

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

2. ఇతరులకు కీడు చేయడం

ఇతరులకు మేలు చేసి సోదరప్రేమను పెంపొందించుకోవాలి అన్నాం. కాని దౌర్బల్యం వలన తరచుగా యితరులకు కీడుచేసి సోదరప్రేమను భంగపరుస్తూంటాం. ఇతరులకు హాని కలిగించే దుష్కార్యాలు బోలెడన్ని చేస్తూంటాం. వీటిల్లో ప్రస్తుతానికి ఒక్కదానిని గూర్చి మాత్రం విచారిద్దాం. అది దుర్మాతృక. దుర్మాతృక అంటే, మనం చేసే పాడుపని ద్వారా ఇతరులను కూడా పాపానికి పురికొల్పడం.

మనం రకరకాలుగా దుర్మాతృక చూపుతూంటాం. ఎదుటి వ్యక్తి మూడవ వ్యక్తిని గూర్చి మనతో చెప్పిన సంగతులను ఆ మూడవ వ్యక్తికి తెలియజేస్తూంటాం. దానివలన ఎదుటి వ్యక్తికీ, మూడవ వ్యక్తికీ వైరం కలిగిస్తుంటాం. ఇంకా, మనం మోసాలూ దొంగతనాలూ దుర్విమర్శలూ చేస్తుంటాం. ఇతరులను కూడ ఈ పాడు పనులకు ప్రోత్సహిస్తూంటాం. మన మతాన్ని గురించీ, మతాధికారుల గురించీ, గుడికి వెళ్ళడం దేవద్రవ్యానుమానాలను స్వీకరించడం మొదలైన క్రైస్తవాచరణలను గూర్చి తేలికగా మాటలాడుతుంటాం. దీనిద్వారా మన యిరుగుపొరుగువాళ్ళ భక్తినిగూడ చెడగొడుతూంటాం, చెడు పుస్తకాలను చదివి ఇతరులకు అందీయడం ద్వారా నైతేనేం, చెడు జాబులను చేరుస్తూండడం వల్ల నైతేనేం, చెడు సల్లాపాలవల్ల నైతేనేం, చెడ్డ వస్త్రధారణవల్లనైతేనేం ఇతరుల పారిశుద్ద్యాన్ని కూడా చెడగొడుతూంటాం. ఈ విధంగా రోజురోజు మనం చేసే రకరకాల చెడు పనుల ద్వారా ఇతరులను పాపానికి పురికొల్పుతూంటాం. అందుకే ప్రభువు "ఇతరులకు దుర్మాతృక చూపడం కంటి మెడకు తిరుగలి రాయి కట్టుకొని సముద్రంలో దూకడం మేలు" అన్నాడు - మత్త 18,6. విశేషంగా పై స్థానంలో వున్నవాళ్లు ఈ దుర్మాతృకను గూర్చి నిశితంగా ఆత్మశోధనం చేసికోవాలి. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, పెద్దలు, గురువులు, మఠశ్రేషులు మొదలైనవాళ్లు తమ పెద్దరికంవల్ల పిన్నలను మంచికిగాని చెడ్డకుగాని పరికొల్పగలరు. వాళు చెడ్డపనులను పిన్నలు సులభంగా అనుకరిస్తారు. ఆవు చేలో మేస్తూంటే దూడ గట్టున మేస్తుందా?

"లోకం బోలెడన్ని దుర్మాతృక లిస్తుంది" అన్నాడు ప్రభువు - మత్త 18, 17. పత్రికలు, గ్రంథాలు, సినిమాలు, రేడియోలు, నాటకాలు నవనాగరికుల వేషభాషలు, పెద్ద ఉద్యోగుల లంచాలు మోసాలు, రాజకీయ పక్షాల దౌర్జన్యాలు కుతంత్రాలు - ఈ విధంగా లోకం నారారూపాల్లో ప్రతిక్షణం దుర్మాతృక నిస్తూనే వుంటుంది. లోకం పోకడ ఓ మహా ప్రవాహం లాంటిది. విచక్షణాజ్ఞానం సామాన్య జనమంతా ఈ ప్రవాహంలో బడి కొట్టుకొని పోతూంటారు.

ఐనా మనం ఈ చెడ్డతనానికి లొంగిపోకూడదు. దాన్ని ఎదుర్కొంటూండాలి. నీ కుడికన్నుగాని కుడికాలుగాని దుర్మాతృకనిస్తే వాటిని పెరికివేయ" మన్నాడు ప్రభువు - మత్త 5,29-30. కనుక దుర్మాతృక ఎవరిదగ్గరినుండి వచ్చినా దాన్ని నిరోధించాలేగాని