పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 276 P.pdf/88

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

లక్షణాలు వాళ్ళ నొసటి మీద వ్రాసిలేవు. అవి మనకంటికి అగుపింపవు. ఐనా విశ్వాసంతో వాటిని నమ్ముతూండాలి. ఓ వికారమైన పూజాపీఠం. అది మనకంటికి ఇంపుగా వుండదు. కాని దానిమీది దైవసాన్నిధ్యాన్ని తప్పక ఆరాధిస్తాం. అలాగే తోడినరుడూ బలహీనప ప్రాణి, అతని మాటలూ చేతలూ అసందర్భంగా వుంటాయి. ఐనా పీఠంమీదలాగే అతనిలోనూ దైవసాన్నిధ్యం నెలకొనివుంది. అంచేత అతన్ని అంగీకరింపక తప్పదు. బలహీనుడని తెలిసికూడ దేవుడే అతన్ని ఆదరిస్తూంటాడు, ప్రేమిస్తుంటాడు. మరి మనం అన్యథా ప్రవర్తించ వచ్చా? కనుక మనం తోడి నరులను గౌరవించాలి, ప్రేమించాలి, వినయ భావంతో అతడు మనకంటె యోగ్యుడేమో అనుకుంటూండాలి. భక్తుడు ఫ్రాన్సిస్డి సేల్సు తోడినరుడ్డి సువిశేషకారుడైన యోహానుకు మల్లె క్రీస్తు హృదయంమీద ఆనుకొని వున్నట్లుగా భావించమన్నాడు. ఈలాంటి వినయభావం వల్ల రెండు ఫలితాలు సిద్ధిస్తాయి (1) ఇతరులు మనకంటె యోగ్యులై వుండవచ్చుగదా అనుకొని వాళ్ళను భూషిస్తాం. పాలు కూడా ఫిలిప్పీయులకు వ్రాసూ ‘వినయంతో తోడి ప్రజలు మీకంటె యోగ్యులనిభావిస్తుండండి" అని హెచ్చరించాడు - 2,3 (2) దేవుని దృష్టిలో తోడి ప్రజలే మన కంటె యోగ్యులై వుండవచ్చును గనుక వాళ్ళను గౌరవిస్తాం. పౌలుకూడ రోమీయులకు వ్రాస్తూ "సోదర ప్రేమతో ఒకరినొకరు ప్రేమించుకుంటూ, గౌరవభావంతో ఒకరినొకరు గొప్పగా ఎంచుకుంటూండండి" అని చెప్పాడు – 12, 10. ఈ వినయభావం, ఈ గౌరవభావం సోదర ప్రేమను పెంపునకు గొనివస్తాయని పేరుగా చెప్పనక్కరలేదు కదా! ఫలితార్థమేమిటంటే, క్యూరేడార్సు చెప్పినట్లు, దేవునితో నరునితో లాగ సంభాషించడం విశ్వాసం. తోడి నరుణ్ణి యేసుక్రీస్తును చూచిన చూపన జూచి ఆదరించడం సోదరప్రేమ.

2. తలపుల్లో సోదర ప్రేమ

సోదరప్రేమ మొదట తలపుల్లో వుంటుంది. భావాత్మకంగా వుంటుంది. అనగా మనం ఇతరులను గూర్చి ప్రేమపూరితమైన భావాలు కలిగి వుండాలి. ఇతరులనుగూర్చి చెడ్డగా గాక, మంచిగా భావిసూండాలి. ఈ సందర్భంలో ప్రస్తుతానికి రెండంశాలు చూద్దాం. ఇతరులగూర్చి మంచిగా భావిస్తూండడమంటే ఇతరులు వృద్ధిలోనికి వచ్చినపుడు వాళ్ళను అభినందిసూండడం, ఇతరుల కలిమినిగూర్చి అసూయ పడకుండా వుండడం.

1. ఇతరులను అభినందిస్తూండడం

ఇతరులు వృద్ధిలోనికి ప్రసిద్ధిలోనికి వచ్చినప్పుడూ, విజయం సాధించినప్పడూ, సంతోషచిత్తులుగా వున్నప్పడూ వాళ్ళతోపాటు మనమూ సంతోషించాలి. వాళ్ళ సంతోషంలో మనమూ పాల్గొనాలి. ఎలిసబేత్తు చాలకాలం గొడ్రాలైయుండి, వృద్ధాప్యంలో బిడ్డను కంది.