పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 276 P.pdf/87

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

4.ఈ వ్యక్తి క్రీస్తు చిందించిన పవిత్ర రక్తం ద్వారా రక్షణం పొందినవాడు.
5. ఈ వ్యక్తి క్రీస్తు శరీరాన్నే ఆహారంగా పుచ్చుకొనేవాడు.
6. ఇతడు పాపాత్ముడైనా దేవుడు ఇతని పరివర్తనం కోసం ఎదురు చూస్తుంటాడు.
7. ఉత్తాన క్రీస్తు ఇతనిలోను ప్రత్యక్షమై వుంటాడు. కనుక నే నితన్ని ఆదరించినపుడు క్రీస్తనే ఆదరించునట్ల, ఇతన్ని అనాదరం చేసినపుడు క్రీస్తునే అనాదరం చేసినట్లు,
8. ఇతడు దేవునికి పోలికగా కలిగింపబడినవాడు. భగవద్రూపమైన ఈ నరుడ్డి నేను అనాదరం చేయవచ్చా? 9. నరులందరూ దేవుని బిడ్డలే. కనుక దేవుడు ఇతన్నికూడా తన సొంత బిడ్డనులా ఆదరిస్తుంటాడు. 10.ఈ నరుడు ఓనాడు దేవుని చేరి దేవుని సముఖంలో నిలుస్తాడు - గల 4,7.

నరునిలోని దివ్య లక్షణాలను చూపడానికి ఈలాంటి కారణాలను ఎన్నిటినైనా ఉదాహరించవచ్చు. ఇచ్చట మచ్చునకు కొన్నిటిని ఉదాహరించాం. ఈ లక్షణాలను మననం చేసికొని తోడి నరులపట్ల ఆదరమూ, ప్రేమా, గౌరవమూ పెంపొందించుకుందాం. పై జాబితాలోని చివరి మూడు లక్షణాలూ క్రైస్తవేతరులకు గూడ వర్తిస్తాయి. ప్రేమ విశ్వతోముఖమైంది. కనుక క్రైస్తవేతరులను గూడ మనం ప్రేమభావంతో ఆదరిస్తుండాలి.

పైన చెప్పిన అంశాలు ఆంతరంగికంగా హృదయంలో పెంపొందించుకోవలసిన భావాలు. కాని సోదరప్రేమను పాటించాలంటే యీ యాంతరంగిక భావాలు మాత్రమే చాలవు. బాహ్యాచరణం కూడ వుండాలి. ఓమారు ఓ ధర్మశాస్తోపదేశకుడు క్రీస్తును కలసికొని "నీవలె నీ పొరుగు వారిని గూడ ప్రేమించు" అన్న కట్టడను ఉదాహరించి "నా పొరుగు వాడెవడు?" అని ప్రశ్నించాడు. క్రీస్తు అతనికి మంచి సమరయుని సామెతను జెప్పి _అక్కరలోనున్నవారిని ఆదుకోవడమే పొరుగు వారిని ప్రేమించడమని విశదం చేసాడు. నీవు కూడా అక్కరలో నున్న వారికి నీ శక్తికొలది సహాయం చేయమన్నాడు. - లూకా 10,87 కనుక మనం సోదర ప్రేమను ఆచరణ పూర్వకంగా చూపాలి. మన చుట్టుపట్లనున్న వారిని చేతనైన రీతిగా ఆదరించాలి. ఇదిగాని క్రియాత్మకమైన సోదర ప్రేమకాదు. తలపల్లో చేతల్లో సోదర ప్రేమను ఎలా చూపాలో మీదటి అధ్యాయాల్లో స్పష్టమౌతుంది.

సోదర ప్రేమ మన మనుకున్నంత సులభమైంది కాదన్నాం. గాఢమైన విశ్వాసం లేందే సోదర ప్రేమ అలవడదు. మనకు బయటకు కన్పించేది, తోడి ప్రజల బలహీనతలూ, ఏబ్రాసి పనులూ మాత్రమే. ఐనా మనం వాళ్ళల్లోని దివ్యలక్షణాలను చూస్తూండాలి. ఈ