పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 276 P.pdf/89

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

యూద స్త్రీలు బిడ్డను కనడం మహా భాగ్యంగా భావించుకునేవాళ్ళు, కనుక ఇరుగు పొరుగువాళ్ళంతా ప్రభువు ఎలిసబేతును కనికరించాడు గదా అని ఆమెతో పాటు సంతోషించారు. - లూకా 1,58. ఇది యథార్థ సోదర ప్రేమ. మామూలుగా ఇతరులు కష్టాలనుభవించేపుడు సానుభూతి చూపడం సులభమౌతుందిగాని వాళ్ళ పచ్చగా వున్నప్పుడు ఓర్చుకోవడమూ, వాళ్ళతో పాటు సంతోషించడమూ కష్టమనిపిస్తుంది. ఐనా సంతోషించే వాళ్ళతో సంతోషించడ మనేసదుణాన్ని మనం ప్రయత్నపూర్వకంగానైనా అలవరచుకోవాలి.

2. అసూయ

తరచుగా యితరుల వృద్ధిని జూచి సంతోషించడానికి మారుగా అసూయకు లొంగిపోతూంటాం, అసూయ అంటే యితరులు పచ్చగా వుండడం జూచి మనసు నొచ్చుకోవడం, బాధపడ్డం, యూదులు అసూయ వలన క్రీస్తును పిలాతున కప్పగించారు - మత 27, 18. క్రీస్తు ప్రసిద్ధినీ, జనమంతా అతన్ని వెంబడించడాన్నీ చూచి సహించలేకపోయారు. జన్మ పాపఫలితంగా నరులందరిలోను దుష్టగుణాలు నిండుకొని పోయాయి. ప్రతి నరునిలోను దేహాత్మలు పరస్పర వైరంతో పోరాటం ప్రారంభించాయి - గల 5, 17. దీని ఫలితంగా నరుడు అనేక అవలక్షణాలతో నిండిపోయాడు. ఈ యవలక్షణాల్లో ఒకటి అసూయ. ఈ అసూయవలన తరచుగా సోదరప్రేమను ఉల్లంఘిస్తుంటాం. ఎదుటి వాడంటే గిట్టని తలంపులు తలుస్తూంటాం. మనలోని ఈ యసూయా గుణాన్ని గ్రహించకుండా వుండటం పరమ మూర్ఖత్వం.

ఆదిలో అసూయవలన పిశాచం ఆదామేవలకు పతనం తెచ్చిపెట్టింది. "పిశాచం అసూయ వలననే మరణం లోకంలోనికి ప్రవేశించింది" అంటుంది సోలోమోను జ్ఞాన గ్రంథం - 2, 24 అసూయవలన కయీను హేబెలును పొలానికి తీసికొనివెళ్ళి చంపివేసాడు - ఆది 4, 8, యోసేపు సోదరులు అసూయవలన యోసేపను గోతిలోనికి ద్రోసివేసి యిష్మాయేలు బేహారులకు అమ్మివేసారు - ఆది 37, 28. ఓ మారు దావీదు ఫీలిస్టీయులను గెలిచి విజయంతో తిరిగిరాగా స్త్రీలు "సౌలు వేయిమందిని వధించగా దావీదు పదివేల మందిని వధించాడు" అని నాట్యంచేస్తూ పాట పాడారు. ఆ పాటవిని సౌలు అసూయతో మగ్గిపోయాడు. దావీదును చంపాలని విశ్వప్రయత్నాలు చేసాడు - 1 సమూ 18,7.యూదులు అసూయతో క్రీస్తును చంపించారు. అసూయ ఈలాంటి ఘాతుక కార్యాలను ఎన్నిటినైనా చేయిస్తుంది. దానికి వశంగానినరులు చాల అరుదు. మహానుభావులే దానికి లొంగిపోయారు. ఇక అల్పమానవులమైన మనం దైనందిన జీవితంలో రోజురోజు పెద్ద విషయాల్లోనో, చిన్న విషయాల్లోనో అసూయకు గురౌతూనే వుంటాం. దీని ద్వారా