పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 276 P.pdf/85

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మరో తావులో ప్రభువు క్రీస్తుపేర శిష్యులకు గ్రుక్కెడు మంచి నీళ్ళిచ్చినవాడు కూడ ప్రతిఫలం పొందుతాడనీ, దుర్మాతృక ద్వారా ఆ శిష్యులకు హానిచేసినవాళ్ళ ఫనోర శిక్షననుభవిస్తారని బోధించాడు - మార్కు9, 40-42. ఈ వాక్యాలనుబట్టి కూడా క్రీస్తు తన ప్రజలతో ఐక్యమైవుంటాడనీ వాళ్ళకు చేసిన మేలుకీడులను తనకు చేసినట్లే భావిస్తాడనీ అర్థంచేసికోవచ్చు గదా! సౌలు క్రైస్తవులను హింసించాడు. కాని క్రీస్తు ఆ హింస తనదిగానే భావించి “సాలూ సాలూ! నన్నెందుకు హింసిస్తున్నావు?” అని అడిగాడు - అచ 9,4. క్రీస్తు సోదరజనంలో జీవిస్తుంటాడనడానికి ఇంతకంటె ప్రబల తార్కాణం ఏం కావాలి?

ఇందుకే యోహాను మొదటిజాబు" ఎవరైనా నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాని చెప్పకొంటూ తోడిజనులను ద్వేషించినట్లయితే అతడు వట్టి అబద్దాలకోరు" అంటుంది. - "కంటికగుపించే తోడి జనులను ప్రేమించలేనివాడు కంటి కగుపించని భగవంతుణ్ణి ఎలా ప్రేమిస్తాడు" అని ప్రశ్నిస్తుంది- 4,20. ఇవి చాల గొప్ప వాక్యాలు. దేవుడు మనకు కన్పింపడు. అతడు మనకంటె చాల గొప్పవాడు. పరిపూర్ణుడు. కనుక ఆ దేవుని సన్నిధిలోనికి వెళ్ళి మ్రెక్కుకోవడం చాల సులభం. అతన్ని ఆరాధిస్తున్నాము, ప్రేమిస్తున్నాము అనుకొని బ్రాంతిపడ్డం కూడా సులభమే. కాని తోడి నరులు మన కంటికి కన్పించేవాళ్ళు వాళ్ళ బలహీనతలూ, వాళ్ళు చేసే ఏబ్రాసి పనులూ మనకు బాగా తెలుసు. ఈలాంటి తోడినరులను మనం సులభంగా ఆదరించలేం. ప్రేమించలేం. ఐనా ఈ నరుల్లో ఈ దేవుడు నెలకొని వుంటాడు. అతని కోసం వీళ్ళను ఆదరించాలి. అలా ఆదరించనపుడు అతన్నే అనాదరం చేసినట్ల, కనుక ఈ సోదరప్రేమ లేనికాడ దైవప్రేమ కూడా లేదు. ఉందనుకొని బ్రాంతిపడితే మనలను మనం మోసంచేసుకున్నట్లే. అందుకే సోదరప్రేమను పాటించకుండ దైవప్రేమను సాధిస్తున్నాననేవాడు వట్టి అబద్దాలకోరు అంటుంది పై వేదవాక్యం.

3. యోహాను వాడిన ఉపమానాలు

యోహాను తాను వ్రాసిన మొదటి జాబులో సోదరప్రేమ కలిమినీ, సోదర ప్రేమ లేమినీ సూచిసూ చక్కని ఉపమానాలు వాడాడు. ఉపమానం ఎప్పుడూ మనం చెప్పదలచుకున్న సత్యాన్ని ప్రస్ఫుటం చేస్తుందిగదా! ఆలాగే ఇక్కడ కూడాను.

సోదర ప్రేమ వెలుగు. అది లేమి చీకటి. కనుక ప్రేమగల మానవులు వెలుగులోను, పేమలేని మానవులు చీకటిలోను సంచరిసూంటారు - 2,10. సోదరప్రేమగల మానవులు దేవుని బిడ్డలు. అది లేనివాళ్లు పిశాచ సంతానం - 8,10. సోదరప్రేమ జీవం. దాన్ని విడనాడ్డం మరణం - 3,14 సోదరప్రేమను పాటించడం సత్యాన్ని పాటించడమే. దాన్ని మీరడం అబద్ధ మాడ్డమే - 4,20. పైగా సోదరులను