పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 276 P.pdf/78

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఏలినవారా! దయచూపండి.

నా దేవా! నా ప్రభువా!

నా మధురమైన యేసూ! నాకు న్యాయాధిపతివి కాక,

రక్షకుడవుగా వుండు.

దేవా! నన్నాదుకోడానికి శీఘ్రమే రా.

నా చిత్తంగాదు, నీ చిత్తమే నెరవేరాలి.

ఉన్నతమందు సర్వేశ్వరునికి మహిమ.

పితకును సుతునకును పవిత్రాత్మకును మహిమ కలుగునుగాక.

ప్రభూ! నీకే ద్రోహంగా నేను పాపం చేసాను.

నీ వాక్యం నా త్రోవకు వెలుగు లాంటిది.

ప్రభువు పవిత్రుడు, పవిత్రుడు, పవిత్రుడు.

ప్రభువే నాకు కాపరి, యిక యే కొదవా లేదు.

దేవా! నాలో నిర్మల హృదయాన్ని సృజించు.

ప్రభువే నాకు శైలము, కోట, రక్షణదుర్గము.

నన్ను నేను నీచేతుల్లోనికి అర్పించుకొంటున్నాను.

నీ ముఖ కాంతిని నా మీద ప్రకాశింపనీయి.

నీ వద్ద జీవధార వుంది.

మనం ప్రతిదినం చదువుకొనే బైబులు వాక్యాలను వేటినైనా భక్తితీక్షణ జపాలుగా వాడుకోవచ్చు. బోనవెంచరు భక్తుడు వాకొన్నట్లు, ఈ ప్రార్ధనలద్వారా మన ఆత్మ పక్షిలా దేవుని చెంతకు ఎగిరిపోతుంది. మనకు తెలియకుండానే మనం గాలి పీల్చుకొంటుంటాం. ఆలాగే కొంతకాలం అభ్యానం చేసాక మనకు తెలియకుండానే మన ఆత్మ ఈ జపాలనుచెప్పకపోతూంటుంది.

9. రాత్రి పండుకొనేపుడు మన హృదయాన్నీ ఆలోచనలనూ సృష్టివస్తువులనుండి తొలగించి దేవుని చేతుల్లోకి ఒప్పగించుకోవాలి. అనగా మనలను మనం ప్రభువుకి అర్పించుకోవాలి. ఆ కీర్తనకారునిలాగే "నేను పండుకోగానే ప్రశాంతంగా నిద్రిస్తాను. ప్రభూ! నేను సురక్షితంగా మనేలా చేసేవాడివి నీవే" అని చెప్పుకోవాలి - 4,8. “దేవా! నన్ను నేను నీ చేతుల్లోకి అర్పించుకొంటున్నాను. నీ రెక్కల మాటున నన్ను సురక్షితంగా దాచివుంచుకో" అని మనవి చేసికోవాలి. ఈలాంటి భావాలతో దైవసాన్నిధ్యంలో ప్రశాంతంగా నిద్రపోవాలి.