పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 276 P.pdf/77

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఉన్నామనుకోవాలి. అతనికి కొలువు చేస్తున్న దేవదూతలు మనవైపు చూస్తున్నారనుకోవాలి. ఆలా భావించి భక్తితో జపం చేసికోవాలి".

బెర్నార్డు భక్తుడు కూడ ఈలా నుడివాడు. "మనంగుడిలోనికి వెళ్ళినపుడుగాని లేదా మన గదిలోనే జపం చేసికోవడం ప్రారంభించినపుడు గానీ మనలను మనం హెచ్చరించుకొని ఈలా చెప్పకోవాలి. ఓ దుష్ట ఆలోచనల్లారా! పాపపు వ్యామోహాల్లారా! మీరు బయటనే వుండిపొండి నా యాత్మమా! నీవు మాత్రం దేవుని సన్నిధిలోనికి ప్రవేశించు. అతని చిత్తాన్ని తెలిసికొని అతని ఆజ్ఞలను పాటించు. ఈలా మనలను మనం హెచ్చరించుకోవడంవల్ల అవధానంతో జపం జేసికోగల్లుతాం".

ఈ భక్తులు సూచించిన అభ్యాసాలను వినియోగించుకొని మనంకూడ ప్రార్థనకు ముందు దైవసాన్నిధ్యం కలిగించుకోవాలి. దీనివల్ల శ్రద్ధతో ప్రార్ధనం చేసికొంటాం, దేవుణ్ణి కూడ అనుభవానికి తెచ్చుకొంటాం.

7. మనం ప్రార్ధనం చేసికొనేపుడు క్రీస్తకూడ మనతో ప్రార్ధనం చేస్తుంటాడు. మనం అతనితో కలసి భక్తితో ప్రార్ధనం చేసికోవాలి. ఈలా క్రీస్తుతో కలసి పరలోక జపం చెప్పకోవచ్చు. అది ఆ ప్రభువు స్వయంగా శిష్యులకు నేర్పిన జపం, ఇంకా కీర్తనలూ ఇతర జపాలూకూడ ఈ పద్ధతిలో చెప్పకోవచ్చు. పెద్దతేరేసమ్మ ఈ పద్ధతిలో జపించేది. ఆమె యితరులకు కూడ ఈ పద్ధతిని సిఫార్సు చేసింది. క్రీస్తు మోక్షంలో తండ్రి సమక్షంలో వుండి నిరంతరమూ మన కొరకు విజ్ఞానం చేస్తూంటాడని చెప్తుంది హెబ్రేయుల జాబు - 7,25. కనుక మనం ఆ ప్రభువుతో కలసి జపం చేసికోవడంలో ఇబ్బంది ఏమీ లేదు. దీనివల్ల మనహృదయంలో సాన్నిధ్యభావం మరింత బలపడుతుంది.

8. దైవసాన్నిధ్యాన్ని గుర్తుకి తెచ్చుకోవడం సులభమే. కాని కొంతసేపయ్యాక ఆ సాన్నిధ్యాన్ని పూర్తిగా మర్చిపోతాం. లోక వ్యాపారాల్లో పడిపోతాం. ఈలా మర్చిపోకుండా వుండడానికి భక్తులు అనాది కాలంనుండి గూడ భక్తితీక్షణ జపాలు చెప్పకొంటూండేవాళ్లు. ఇవి చిన్నజపాలు. తరచుగా బైబులు వాక్యాలు. కాని యివి చిన్నవైనా అపారమైన భక్తిని కలిగిస్తాయి. వీటిద్వారా మన హృదయాన్నిదేవుని మీదికి త్రిప్పకోవచ్చు మర్చిపోయిన దేవుణ్ణి మరల గుర్తుకి తెచ్చుకోవచ్చు. వీటిని వాడుకోవడం ద్వారా శతాబ్దాల పొడుగునా చాలమంది భక్తులు అశేష లాభాన్ని సాధించారు. కనుక మనంకూడ వీటిని వాడుకోవాలి. ఉదాహరణకు ఈ క్రింది జపాలు వినియోగించుకోవచ్చు.