పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 276 P.pdf/69

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మనం అతన్ని నమ్మాలి. ఆ ప్రభువు మన హృదయంలో ఒక్క పలుకు పలికితే చాలు మన దౌర్భాగ్యాలన్నీ తొలగిపోయి పరమానందం చెందుతాం. కనుక చిన్నబిడ్డ తల్లి నిలాగ మనం అతన్ని ఆశ్రయించాలి.

6. దైవసాన్నిధ్యాన్ని పాటించడమంటే ఆ ప్రభువు చిత్తానికి లొంగడంకూడ. విశేషంగా కష్టాలు దాపురించినపుడు అతడు నిర్ణయించిన మార్గంలో నడవాలి. నీ చిత్తం పరలోకంలోలాగే భూలోకంలోను నెరవేరునుగాక అని పల్కాలి -లూకా 22,42. కొందరు తెలియక దేవుణ్ణి తమ చిత్తానికి లొంగదీసికోబోతారు. కాని ఆ ప్రభువు మనకు లొంగడు. మనమే అతనికి లొంగాలి. యోబు అష్టకష్టాల్లో వున్నపుడు కూడ నేలపై బోరగిలపడి దేవునికి దండం పెట్టి "నేను దిగంబరుడ్డిగా తల్లి కడుపు నుండి వెలువడ్డాను దిగంబరుడనుగానే యిక్కడి నుండి వెళ్ళిపోతాను ప్రభువు దయచేసిన వానినెల్ల మరల తానే తీసికొన్నాడు అతని నామానికి స్తుతి కల్లునుగాక"

అని పల్కాడు - యోబు 1,21. ఈలా కష్టాల్లో దేవునికి లొంగడంలోనే వుంది భక్తి

7. మోక్షంలో పునీతులు దేవుణ్ణి ముఖాముఖి దర్శిస్తారు. మోక్షంలోని వాళ్ళకు ఆ ప్రత్యక్ష దర్శన మేలాంటిదో భూలోకంలో మనకు భగవత్సాన్నిధ్యం ఆలాంటిది. ఐతే వాళ్ళకు ప్రత్యక్ష దర్శనమైంది మనకు పరోక్షదర్శనమౌతుంది. పాపాత్ములు కయీనులాగ దేవుని సన్నిధిలోనుండి వెళ్ళిపోతారు - ఆది 4,16. కాని భక్తులను దేవుని సన్నిధిలోకి వస్తారు. ప్రభువు పూర్వం అబ్రాహాముకి సెలవిచ్చినట్లే తన భక్తులకు గూడ "మీరు నా సన్నిధిలో నడుస్తూ పరిపూర్ణులై ఉండండి" అని ఆదేశిస్తాడు - ఆది 17,1.

ఇవన్నీ కూడ దేవుని సాన్నిధ్యాన్ని పాటించే మార్గాలు. భక్తులు ఈ మార్గాల్లో ఒకప్పడు ఒకదాన్నీ మరొకప్పడు మరొకదాన్నీ యెన్నుకొని దేవుణ్ణి అనుభవానికి తెచ్చుకోవాలి. భగవత్సాన్నిధ్యాన్ని పాటించడం మొదటలో కష్టంగానే ఉండవచ్చు. కాని యిక్కడ పేర్కొన్న మార్గాలను పాటిస్తే అది క్రమేణ సులభమౌతుంది.

6. సాన్నిధ్యభక్తివల్ల ప్రయోజనాలు

దైవ సాన్నిధ్యాన్ని పాటించడంవల్ల చాల లాభాలు కల్లుతాయి. ప్రస్తుతానికి కొన్నిటిని పరిశీలిద్దాం.

1. ఈ విధానంవల్ల పాపాన్ని పరిత్యజిస్తాం. దేవుడు నన్ను చూస్తుంటాడు అనుకొనేవాడికి పాపం చేయడానికి ఎన్నిగుండెలు? "ఓ ప్రభూ! నా క్రియలూ ఆలోచనలూ