పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 276 P.pdf/68

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

3. దైవసాన్నిధ్యాన్ని పాటించడమంటే నిరంతరమూ దేవుని సహాయాన్ని అడుగుకోవడం. అతని సహాయంలేందే మనమేమీ చేయలేం. "నేను లేక మీరు ఏమీ చేయలేరు" అన్నాడు క్రీస్తు - యోహా 15,5, ఆ ప్రభువు మన త్రోవలోని చీకటిని తొలగించి వెలుగుని ప్రసాదించేవాడు. మన బలహీనతలను తొలగించి బలాన్ని దయచేసేవాడు. మన దుఃఖాన్ని తొలగించి ఆనందాన్ని చేకూర్చిపెట్టేవాడు. ఆలాంటి ప్రభువుని మనం నిరంతరమూ అర్ధిస్తుండాలి. కీర్తనకారునిలాగే "ప్రభూ! నన్నాదుకో, నాకు సాయం చేయడానికి శీఘమే రా" అని అడుగుకొంటూండాలి - 71,12

4. మనం ఆ దేవుని సమక్షంలో మేరమర్యాదలతో మౌనంగా వుండిపోవాలి.

“దేవుని ముందట నెమ్మదిగా నిల్చివుండు
అతని అనుగ్రహం కొరకు ఓపికతో వేచివుండు"

అన్నాడు కీర్తనకారుడు - 37, 7. దేవుని సన్నిధిలో మౌనంగా వుండిపోవడమంటే ఆ మహాప్రభువుని స్తుతించడమేనని వాకొన్నాడు డయనీష్యస్ భక్తుడు, అందుకే పునీతులు చాలమంది పర్వతం సన్నిధిలో పరమాణువులాగ భగవంతుని సమక్షంలో నిమ్మళంగా వుండిపోయారు.

చాలమంది దేవుని సన్నిధిలో వుండడమంటే ఏవేవో ప్రార్థనలు చెప్పకోవడమని భావిస్తారు. కాని ఇది పొరపాటు. ఈలా ప్రార్థనలు చెప్పేవాళ్ళు తామేవేవో జపాల వల్లెవేస్తుంటారేగాని, ఆ దేవుడు మన హృదయంలో ఏమి మాట్లాడుతున్నాడా అని విన్పించుకోనే విన్పించుకోరు. పెద్ద తెరేసమ్మగారు "మనం ప్రార్ధనంలో దేవునికి అవీ యివీ చెప్పబోతాం. కాని ఆ దేవుడు మనతో ఏమి చెప్తున్నాడో వినం. ప్రార్ధనంలో మనం దేవునితో మాట్లాడతాం. కాని మనం దేవునితో మాట్లాడుతూంటే అతడు కూడ మన హృదయంలో మాట్లాడుతూంటాడు. అతని సంభాషణాన్ని మనం మౌనంగా వినాలి" అని హెచ్చరించారు. అగస్టీను భక్తుడు కూడ "దేవుడూ మన ఆత్మా ఓ ప్రత్యేకమైన భాషలో మాట్లాడుకొంటారు. దేవుడు దయతో మన ఆత్మతో సంభాషించడానికి పూనుకొంటాడు. మన ఆత్మకూడ ఆ ప్రభువుతో సంభాషించడానికి వుబలాటపడుతుంది" అని నుడివాడు. కనుక మనం మౌనంగా, నిమ్మళంగా వుండి మాటలు లేకుండానే దేవునితో సంభాషిస్తుండాలి.

5. దైవసాన్నిధ్యాన్ని పాటించడమంటే మనలను మనం దేవుని చేతుల్లోకి అర్పించుకోవడంగూడ. "నేనెల్లప్పడు నీ యండదండల్లోనే వున్నాను" అన్నాడు కీర్తనకారుడు — 31, 15 ఇంకా అతడే "నన్ను నేను నీ చేతుల్లోకి అర్పించుకొంటున్నాను" అని కూడ పల్కాడు - 31.5. మనం ఈలాంటి ప్రభువుని నమ్మకపోతే మరెవ్వరిని నమ్ముతాం? అతని అనుమతి లేనిదే మన తల వెండ్రుక ఒక్కటి వూడదు - లూకా 21,18. కనుక