పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 276 P.pdf/64

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

"నేను నిన్ను తప్పించుకొని యొక్కడికి పోగలను?
నీ సన్నిధినుండి పారిపోయి యొక్కడికి వెళ్ళగలను?
నేను ఆకాశానికి వెత్తే నీవు అక్కడ వుంటావు.
పాతాళానికి వెళ్లే అక్కడా వుంటావు"

అని చెప్పాలి - కీర్త 139, 7-8 పక్షులు ఎక్కడికెగిరిపోయినా గాలిని తప్పించుకోలేవు. చేపలు ఎక్కడికి ఈదుకొనిపోయినా నీటిని తప్పించుకోలేవు. ఆలాగే మనంకూడ ఎక్కడికి వెళ్ళినా దేవుణ్ణి తప్పించుకోలేం. అతని సాన్నిధ్యంనుండి వైదొలగలేం. అతడు మనలోనే, మన అంతరంగంలోనే వుంటాడు. అగస్టీను భక్తుడు చెప్పినట్లుగా, మనలో మనమున్నదానికంటెగూడ అధికంగానే ఆ భగవంతుడు మనలో వుంటాడు. ఆలాంటి ప్రభువుని విస్మరించడం గొప్ప అనర్ధం కదా!

2. అంతటావుండే దేవుడ్డి మనం జ్ఞప్తికి తెచ్చుకోవాలి

అంతటావుండే దేవుణ్ణి మనం ఎల్లవేళలా, ఎల్లతావుల్లోను జ్ఞప్తికి తెచ్చుకోవాలి. గొప్పవాళ్ళ మన దృష్టి నాకర్షిస్తారు. మన హృదయాన్ని వారినుండి మరల్చుకోలేం, ఐనా అందరికంటె గొప్పవాడైన భగవంతుణ్ణిమాత్రం మనం విస్మరిస్తాం. మోక్షంలో అర్యశిష్ణులు సదా ఆ ప్రభువునిచూచి ఆనందిస్తూంటారు. మనం మాత్రం అతన్ని తలంచుకోలేం, ఎందుకు? మనం ఈ సృష్టివస్తువులకు అంటిపెట్టుకొని వుంటాం. కనుకనే సృష్టికర్తను జ్ఞప్తికి తెచ్చుకోలేం. అతడు మనకు దగ్గరలోవున్నామనం అతన్ని గుర్తించలేం. మన స్వీయశక్తితోనే మనం జీవిస్తున్నామో అన్నట్లు అతన్ని ఉపేక్షిస్తాం. గ్రుడ్డితనమంటే యిది కాదా?

పూర్వం యిస్రాయేలు ప్రజలు పండ్రెండు రొట్టెలను దేవుని సన్నిధిలో పెట్టివుంచేవాళ్ళ ఆ పండ్రెండు రొట్టెలనుచూచి దేవుడు పండ్రెండు గోత్రాల యిస్రాయేలు ప్రజలను స్మరించుకొనేవాడు - లేవీ 24, 5–9. ఆలా తమ్ము స్మరించుకొనే దేవుణ్ణి ఆ ప్రజలుకూడ భక్తిభావంతో జ్ఞప్తియందుంచుకొనేవాళ్ళ నూత్నవేదంలో మనలనుకూడ దేవుడు నిరంతరం స్మరించుకొంటూంటాడు. అతడు మన మధ్యలో వసిస్తూంటాడు - యోహా 1,14. మన తరపున మనంకూడ అతన్ని యెల్లపుడూ జ్ఞాపకానికి తెచ్చుకొంటూండాలి.

పెద్ద తెరేసమ్మగారు "నేనొకమారు దేవుణ్ణి అనుభవానికి తెచ్చుకొన్నాక ఈ లోకంలోని వస్తువులన్నీ నాకు అణువుల్లా కన్పించాయి. కాని నా మనసింకా వాటి మీదికే పోతున్నందుకు నేను సిగ్గుపడుతున్నాను" అని చెప్పకొన్నారు. ఔను మరి, నరుల్లో అధిక సంఖ్యాకులు కూడూగుడ్డా యిలూవాకిలీ అనే తాపత్రయాలతో సతమత