పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 276 P.pdf/63

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

3. దైవసానిధ్యం

బైబులు భాష్యం - 66

విషయసూచిక

1. దేవుడు అంతటా వుంటాడు

55

2. అంతటా వుండే దేవుణ్ణి మనం జ్ఞప్తికి తెచ్చుకోవాలి

56

3. అంతటా వుండే దేవుణ్ణి గౌరవించాలి

57

4. అంతటా వుండే దేవుణ్ణి ప్రేమించాలి

58

5. దైవసాన్నిధ్యాన్ని పాటించడం అంటే యేమిటి?

59

6. సాన్నిధ్యభక్తివల్ల ప్రయోజనాలు

61

7. సాన్నిధ్యభక్తిని కాదనే వాళ్ళకి జవాబు

64

8. దైవసాన్నిధ్యాన్ని పాటించడానికి పది సూత్రాలు

66

9. దైవసాన్నిధ్యాన్ని పాటించడంలో ఎదురయ్యే అవరోధాలు

71

1. దేవుడు అంతటా వుంటాడు

దేవుడు అంతటా వుంటాడు. అతడు మోక్షంలో వుంటాడు. అది అతనికి సింహాసనం. భూమి మీద వుంటాడు. అది అతనికి పాదపీఠం - యెష 66,1. అచ 7,49. భగవంతుడు సర్వాంతర్యామి అని మనం చిన్నప్పడే నేర్చుకొంటాం. ఐనా ఈ సత్యాన్ని అట్టే అర్థంచేసికోం. అట్టే గుర్తించంకూడ.

ప్రభువు అంతటా వుంటాడు కనుక అన్ని వస్తువులూ అతనియందుంటాయి. అతడు అన్నివస్తువుల్లోను వుంటాడు. కాని అతడు విశేషంగా నరుల్లో వుంటాడు. “దేవుడు మనలో ఏ వొక్కరికీ దూరంగా లేడు. మనం అతనిలో జీవిస్తాం, చలిస్తాం, ఉనికిని కలిగివుంటాం. మనం అతని సంతానానిమే" - అచ 17,28. ఐనా ఈ సత్యాన్ని మనమట్టే అర్థంచేసికోం. పూర్వం స్నాపక యోహాను యూదులను చూచి "మీ మధ్య వున్న వ్యక్తిని మీరెరుగరు" అన్నాడు - యోహా 1,26. ఔను, మన మధ్య నిరంతరమూ నెలకొనివుండే దేవుణ్ణి మనం ఎరుగం, అతన్ని ఆరాధించి గౌరవించం. ఇది పెద్ద దౌర్భాగ్యం.

కనుక సువిశేషం పేర్కొన్న ఆ గ్రుడ్డివానిలాగే మనంకూడ వినయ విశ్వాసాలతో "ప్రభూ! నాకు దృష్టి దానం దయచేయి" అని అడుగుకోవాలి - లూకా 18,41. మనం ఆ ప్రభువుని భౌతికంగా కాకపోయినా ఆధ్యాత్మికంగానయినా దర్శించాలి. కావున ఆ కీర్తనకారునిలాగే మనంకూడ