పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 276 P.pdf/48

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

30. మన పాపాలకు ప్రాయశ్చిత్తంగా - 1 యోహా 4,10.

}}

“మనం దేవుణ్ణి ప్రేమించలేదు. దేవుడే మొదట మనలను ప్రేమించి మన పాపాలకు ప్రాయశ్చిత్తంగా వుండడం కోసం తన కుమారుణ్ణి పంపాడు. దీని ద్వారా ఆ దేవుని ప్రేమ యెంత గొప్పదో తెలిసిపోతుంది" అంటుంది 1 యోహాను 4,10. క్రీస్తు మరణంద్వారా పిత తన ప్రేమప్రణాళికను సాధించాడు. క్రీస్తు మన పాపాలకు ప్రాయశ్చిత్తం చేసి అనగా మనకోసం నెత్తురుచిందించి మన తరఫున విజ్ఞాపన ప్రార్ధనం జేసి - ఆ పాపాలను క్షమించాడు. ఇకమీదట మనలను పరిపాలించేది పిశాచంగాదు, ప్రభువే. ఇక మనం దుష్టుని అధీనంలోగాదు, నీతిమంతుని అధీనంలో వుంటాం-1 యోహా 5,19. పిశాచం బిడ్డలంగాదు దేవుని బిడ్డలమౌతాం - 1 యోహా 3,10. ఈ దేవుడు క్రీస్తుద్వారా తన జీవాన్ని మనకు అనుగ్రహిస్తూ వుంటాడు. ప్రభుజీవాన్ని బడసి దివ్య జీవితం జీవించే భాగ్యంకోసం వేడుకుందాం.

31. పాస్క గొర్రెపిల్ల - నిర్గ 12,21-27.

}}

పైన ప్రాయశ్చిత్తాన్ని గూర్చి వివరించాం. ఇక "నెత్తురును" గూర్చి ఆలోచిద్దాం. నెత్తురు ఏం చేస్తుంది? పూర్వవేదంలో మూడు సందర్భాల్లో నెత్తురును వాడారు అవి, 1 పాస్క గొర్రెపిల్ల వధ. 2. సీనాయి నిబంధనం 3. ప్రాయశ్చిత్త బలులు. నూత్న వేదంలో క్రీస్తు చిందించిన రక్తం గూడ ఈ మూడు సందర్భాలను స్మరణకు తెస్తూంటుంది. కనుక నెత్తురును వాడిన యీ మూడు సందర్భాలను గూర్చి విపులంగా తెలుసుకుందాం. మొదట పాస్క గొర్రెపిల్ల వధతో ప్రారంభిద్దాం.

పాస్కగొర్రెపిల్ల వధ నిర్గమకాండ 12, 21-27 వర్ణింపబడింది. ఐగుపులోని యూదులు గొర్రెపిల్లను వధించి దాని నెత్తురును వారు నివసించే ఇండ్ల వాకిలి కమ్మలకు పూసుకోవాలి. యావే ఐగుప్రీయులను నాశం చేయడానికి వస్తాడు. అతడు వాకిలి కమ్మలమీది నెత్తురును చూచి ఆ ఇండ్లను దాటిపోతాడు. అనగా ఆ ఇండ్లలోని ప్రజలను చంపడు. "పేసా" అనే హిబ్రూ పదానికి దాటిపోవడం అని అర్థం. ఈ శబ్దంనుండే "పాస్క" అనే గ్రీకుపదం కల్పించారు.

తరువాత యూదులు వాగ్డత్త భూమిలో పాదుకున్నాక గూడ యేటేట గొర్రె పిల్లను వధించి పాస్మను జరుపుకుంటూనే వుండాలి. "ప్రభువు ఐగుప్రీయులను హతం చేసాడు. కాని మన ఇండ్లను కాపాడాడు. కనుకనే యీ పండుగను చేసికొంటున్నాం" అని యూదులు తమ పిల్లలకు నేర్పించాలి. ఇలా తరతరాల వరకూ యీ యాచారం యిస్రాయేలు కుటుంబాల్లో కొనసాగిపోతూండాలి. ప్రభువు నాటి ఐగుప్తు ప్రజలను కాపాడినట్లే మనలనూ కాపాడుతూండాలని అడుగుకుందాం.