పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 276 P.pdf/49

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

32. గొర్రెపిల్ల నెత్తురు ఏం సాధించింది?

యిస్రాయేలీయులు నెత్తురును తమ ఇండ్ల తలుపు కమ్మలకు పూసారు అన్నాం. ఇది ఓ గురు. ఈ గుర్తును జూచి ప్రభువు ఆ ఇండ్లలోని వారిని చంపకుండా వదిలి వేసాడు, పైగా యీ గుర్తుగల ఇండ్ల యావేకు అంకితమయ్యాయి. అనగా నెత్తురు ఆ ఇండ్లలోని ప్రజలను యూవేకు సమర్పించింది. ఇంకా, ఈ పాస్మబలి ద్వారా యిస్రాయేలీయులు పాపపు ఐగుప్త నుండి వెడలి వచ్చారు. అనగా నెత్తురు పాపం నుండి వారికి విమోచనం కలిగించింది. గొర్రెపిల్ల వధ అనే యీ తంతును తర్వాత వాగ్రత్త భూమిలో కొనసాగించేప్పడు అది "పాస్క బలి" అని పిలువబడుతుంది. ఆ ప్రజలు ఈ బలి ద్వారా తమ పాపాలు పరిహారమౌతాయనే విశ్వసించారు - నిర్గ 12,27. కనుక పాస్క గొర్రెపిల్ల వధ సందర్భంలో నెత్తురు యిప్రాయేలీయులను చావు నుండి కాపాడింది. వాళ్ళను యావేకు అంకితం చేసింది. పాపాన్నుండి రక్షించింది. ఈలాగే ప్రభువు మనలను నిత్యం రక్షించి కాపాడుతూండాలని అడుగుకుందాం.

33. లోకపు పాపాలను భరించే గొర్రెపిల్ల - యోహా 1,29

పై పాస్క గొర్రెపిల్ల ఉదంతాన్ని క్రీస్తుకు అన్వయిస్తుంది నూత్నవేదం, స్నాపక యోహాను క్రీస్తును జూచి "ఇతడు లోకపు పాపాలను భరించే గొర్రెపిల్ల' అంటాడు. ఈ వాక్యంలో క్రీస్తు పాస్కగొర్రెపిల్లతో పోల్చబడ్డాడు. వధింపబడిన పాస్కగొర్రెపిల్ల ఐగుప్నలోని విగ్రహారాధన మనే పాపనుండి యిస్రాయేలీయులను విడిపించింది, తర్వాత పాలస్తీనా దేశంలో ఈ తంతును కొనసాగించినప్పుడు గూడ బలిరూపంగా ప్రజల పాపాలు పరిహరించింది. అదేవిధంగా ఈ క్రీస్తు అనే గొర్రెపిల్లగూడ ప్రజల పాపాలను భరిస్తాడు, పరిహరిస్తాడు అని భావం. ఇంకో విషయం. పాస్క పండుగను చేసికోవడం కోసం శుక్రవారం సాయంత్రం మూడు గంటలకు యెరూషలేం దేవాలయంలో గొర్రెపిల్లలు వధించేవాళ్ళ ఈలా దేవాలయంలో గొర్రెపిల్లలు వధింపబడుతూండగా క్రీస్తుకూడా అదేకాలంలో యెరూషలేం వెలుపల సిలువమీద జీవం విడిచాడు. ఈ సంఘటన వలన గూడ అతడు నూత్న వేదపు పాస్క గొర్రెపిల్ల అని వ్యక్తమౌతుంది. ఈ గొర్రెపిల్ల మన పాపాలనుగూడ పరిహరించాలని వేడుకుందాం.

34. గొర్రెపిల్ల రక్తంతో వస్తాలను ఉదుకు కున్నారు - దర్శ7,14-17

దర్శన గ్రంథం మోక్షంలోని పుణ్యమూర్తులను వర్ణిస్తూ వాళ్ళ గొర్రెపిల్ల రక్తంలో తమ వస్తాలను ఉదుకుకున్నారని చెపుతుంది. అనగా వాళ్లు భూమిమీద శ్రమలనుభవించి నెత్తురోడ్చారు. క్రీస్తు రక్తంలో వస్తాలను ఉదుకుకోగా అవి యెర్రబళ్ళేదు గదా, తెల్లబడ్డాయి. అనగా ప్రభురక్తం వాళ్ళ పాపాలను పరిహరించి నిర్మలంగాను, పరిశుభ్రంగాను వుండేలా