పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 276 P.pdf/40

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

యావేప్రభువు. ఈ బైబులు భగవంతుడు మన పట్లా విమోచకుళ్ళా, దగ్గరి బంధువులా మెలగాలని అడుగుకుందాం.

13. యావే యిచ్చిన విమోచనం - నిర్గ -19, 5-6.

యావే ప్రభువు యిస్రాయేలు జనానికి యేలా విమోచకుడయ్యాడు? ఆ ప్రజలు ఐగుప్త రాజులకు బానిసలయ్యారు. ఆ రాజులు పెట్టేబాధలు భరించలేక యావే ప్రభువునకు మొరపెట్టుకున్నారు - నిర్గ 3,7. ప్రభువు ఐగుప్రీయులను అణచివేసి ఆ ప్రజలను బానిసాన్నుండి విడిపించాడు. అంతమాత్రమే గాదు. వాళ్ళతో ఓ వొడంబడిక గూడ చేసికున్నాడు. ఈ నిబంధనం ద్వారా యూదులు యావే సొంత ప్రజలయ్యారు, රෑපයී యెన్నుకున్న జనమయ్యారు. ఈ నిబంధనమే వాళ్ళను పవిత్రప్రజను చేసింది. యావేకు సమర్పించింది. విమోచకుడైన యావేను ఆరాధించి స్తుతించే యాజక ప్రజనుగా తయారుచేసింది -నిర్గ 19, 5,6. ఇక్కడ ప్రభువు ప్రజను దాస్యాన్నుండి విడిపించడం, అటుపిమ్మట వాళ్ళతో నిబంధనం గావించుకొని వాళ్ళను సొంత ప్రజనుగా తయారుచేసికోవడం - ఇవి రెండూ ఒకే కార్యంగా భావించాలి. మనమూ భగవంతుని ప్రజలం అన్న భావాన్ని సంస్మరించుకుందాం.

14. యూదులనే యెందుకు ఎన్నుకోవాలి? - ద్వితీ 7, 6-8.

ఆనాడు లోకంలో అన్ని జాతులుంటే ప్రభువు యూదజాతినే యెందుకు ఎన్నుకోవాలి? వాళ్ళ అధిక సంఖ్యాకులనా? కాదు. యోగ్యతములనా? ఎంత మాత్రమూ కాదు. ప్రభువు ఆ జనాన్ని ఆదరించి చల్లని చూపునజూచాడు. ఆ జనాన్ని ప్రేమించాడు, ఆ జాతినే ఎన్నుకున్నాడు. అవ్యాజమైన ప్రేమ ఒక్కటే ఆయన యా యెన్నికకు కారణం. యూదులు ప్రభువు తమ్మే యెందుకు ఎన్నుకోవాలి అని ప్రశ్న వేసికొని, ప్రభువు అవ్యాజ ప్రేమే తమ యెన్నికకు కారణం అని జవాబు చెప్పారు. ప్రభువు తమ పట్ల చూపిన ప్రేమకు విస్తుపోయారు. భక్తిభావంతో ఆ ప్రేమను మననం చేసికున్నారు. మన యెన్నికకూ, మన క్రైస్తవానికీ దేవుని ప్రేమ వొక్కటే కారణం అనాలిగదా!

15. నీ విమోచకుడైన యావే - యెష54, 5-10.

ప్రభువు ఐగుప్త దాస్యాన్నుండి మాత్రమే గాదు, బాబిలోను బానిసాన్నుండి గూడ ప్రజలను విడిపించాడు. బాబిలోను ప్రవాసంలో రోజులు సాగిస్తూవున్న యూదులను ఓదారుస్తూ ప్రవక్త యాలా హెచ్చరించాడు : "నిన్ను సృజించిన ప్రభువే నీ భర్త పరిత్యక్తయై దుఃఖాక్రాంతురాలైన భార్యను భర్త మళ్ళా రప్పించుకున్నట్లే, తృణీకృతయైన యావనకాలపు భార్యను పురుషుడు మల్లా పిలిపించుకున్నట్లే, యావే నిన్నుపిలుస్తున్నాడు. నిమిషమాత్రం