పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 276 P.pdf/41

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రభువు నిన్ను విసర్జించాడు. మల్లా నీ విమోచకుడు నిన్ను చేరదీస్తాడు. పర్వతాలు తొలగిపోయినా, కొండలు కదిలి పోయినా ప్రభువు కృపమాత్రం నిన్ను విడనాడదు. అతడు చేసికొని నిబంధనం తొలగిపోదు - యెష54, 5–10. బైబులు ప్రవక్తలు పల్కిన ఓదార్పు పలుకుల్లో శ్రేష్టమైన పలుకులివి! ఈ వాగ్గానం ప్రకారమే ప్రభువు కోరెషు అనే పర్ష్యను రాజును బంపి బాబిలోను రాజులను నాశం జేయించాడు. యిప్రాయేలీయులను మళ్లా రెండవమారు విమోచించి పాలస్తీనాకు తీసుకొనివచ్చాడు. భక్తుడు ప్రతిదిన జీవితసన్నివేశాల్లో గూడ భగవంతుడిచ్చే యీ విమోచనాన్ని గుర్తిస్తూవుండాలి,

16. భావి విమోచనం - యిర్మీయా 31, 33-34.

యిస్రాయేలు ప్రజలు రెండు ప్రవాసాలు అనుభవించారు. రెండు విమోచనాలు చవిచూచారు. కాని పూర్వవేద ప్రవక్తలు భావిలో రాబోయే మరో విమోచనాన్ని గూడ సూచించారు. ప్రభువు కడపటి రోజుల్లో తన ప్రజతో మరో నిబంధనం చేసికుంటాడనీ, ఈమారు రాతి పలకలమీద గాకుండ ప్రజల హృదయాల మీదనే తన నిబంధనలను లిఖిస్తాడనీ, జనుల దోషాలను పూర్తిగా క్షమిస్తాడనీ చెప్పాడు యీర్మీయా. - 31, 33-34. యెహెజ్కేలు ప్రవచనం ప్రకారంగూడ ప్రభువు ప్రజలతో మల్లా ఓ ఒడంబడిక చేసికుంటాడు. వాళ్ళలోని రాతి గుండెను దీసివేసి మెత్తని హృదయాన్ని అనుగ్రహిస్తాడు. తన ఆత్మను వాళ్ళపైకి అన్పుతాడు, వాళ్ళ తన కట్టడలు అనుసరించేలా జేస్తాడు - 36, 26-27. ఈ ధోరణిలోనే కీర్తన కారుడుకూడ "యిస్రాయేలూ యావేమీద ఆశపెట్టుకో, ఆయన యొద్దనుండి సంపూర్ణ రక్షణం లభిస్తుంది" అంటాడు - 130,7. ప్రవక్తల ఈ ప్రవచనాలన్నీ క్రీస్తు సాధించే భావి విమోచనాన్ని సూచిస్తాయి. మనం నేడనుభవించేది ఈ విమోచనమే!

17. క్రీస్తు విమోచనం - మార్కు 10,45.

పూర్వవేద విమోచనాలు క్రీస్తు విమోచనాన్ని సూచించాయి అన్నాం. ఈ క్రీస్తు మన మంటి మీద అడుగుపెట్టి నూతవేద ప్రజలమైన మనలను విమోచించడానికి సంసిద్దుడై "మనుష్యకుమారుడు తన ప్రాణాన్ని విమోచనం క్రయధనంగా సమర్పించడానికి వచ్చా" డని పల్కాడు. మార్కు 10,45. అనగా క్రీస్తు సిలువపై చనిపోయి మనకు పాపవిమోచనం గలిగిస్తాడు. అతని మరణం ద్వారా మన పాపం పరిహారమౌతుంది. మనమూ అతన్ని ఆరాధించే ప్రజలమౌతాం - తీతు 2,14. అతడు సాధించిన విమోచనం వల్ల మనం నీతిమంతుల మౌతాం - రోమ 3, 24. ఈరీతిగా పూర్వవేద భగవంతుడు ప్రజలను ఐగుప్త దాస్యాన్నుండి విమోచించాడు. నూత్నవేద భగవంతుడు ప్రజలను