పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 276 P.pdf/39

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

జైలు అధికారికి బోధిస్తూ, ప్రభువును విశ్వసించమని చెప్పాడు - అచ 16,31. రెండవది, ఆ ప్రభువులోనికి జ్ఞానస్నానం పొందడం ద్వారా -1 పేత్రు 3,20-22. నోవా కుటుంబం ఓడవలన జలప్రళయం నుండి రక్షింపబడింది. ఈ యోడ నూత్నవేదప జ్ఞానస్నానాన్ని సూచిస్తుంది. ఓడ నోవా కుటుంబాన్నిమల్లె జ్ఞానస్నానం మనలను రక్షిస్తుంది; క్రీస్తు రక్షణం మనకు సంక్రమించేలా చేస్తుంది. కనుక మన విశ్వాసమూ, జ్ఞానస్నానమూ మనకు యథార్థ రక్షణాన్ని అనుగ్రహించాలని అడుగుకుందాం.

11.రక్షణంకోసం నిరీక్షిస్తుండాలి- రోమా 8,24.

ప్రభు రక్షణం మనకు యీవరకే లభించింది - తీతు 3, 4. ఆయన కృపచేత మనం యీవరకే రక్షింపబడ్డాం - ఎఫె 1,5. ఐనా మన రక్షణం ఇంకా పూర్తికాలేదు. కావున యీ రక్షణం కోసం నిరీక్షిస్తుండాలి- రోమ 8,24. రక్షకునికోసం కనిపెట్టుకొని వండాలి. ఆ ప్రభువు మళ్ళా విజయంచేసి మనకు ఉత్దానం ప్రసాదిస్తాడు; మన యీ భౌతిక శరీరాన్ని మహిమపరుస్తాడు. అప్పడుగాని మన రక్షణం పూర్తిగాదు. కనుక అప్పటిదాకా మనం వేచివుండాలి - ఫిలి 3, 20-21. ఈ మధ్యకాలంలో మనం భూలోక వస్తువుల మీదగాక పరలోక వస్తువుల మీద మనసు నిల్పి జీవిస్తుండాలి - కొలో 3,1- 4. మనమింకా పూర్తి రక్షణాన్ని పొందలేదు అన్నయిూ సత్యమే ప్రస్తుతపు మన నైతిక జీవితానికి, పుణ్య జీవితానికి ఆధారం కావాలి. కావున యీ భావిరక్షణం కోసం భక్తిశ్రద్ధలతో కృషిచేసే భాగ్యం అడుగుకుందాం.

12. యావే విమోచకుడు

ఇంతవరకు బైబులు భగవంతుడు "రక్షకుడు" అన్న అంశం విచారించాం. ఇక అతడు "విమోచకుడు" అన్న విషయాన్ని విలోకిద్దాం. బైబులు యావేను విమోచకుడు అని పిలుస్తుంది. ఎందుకు? విమోచకుడనగా విడిపించేవాడు. మోషే ధర్మశాస్త్రం ప్రకారం, యూదులు పేదలై ఆస్తిపాస్తులు కోల్పోయినట్లయితే, దగ్గరి బంధువులు వాళ్ళ ఆస్తిని మళ్ళా సంపాదించి పెట్టాలి — లేవీ 25,25. పేదతనంవల్ల బానిసలుగా అమ్ముడువోయినట్లయితే దగ్గరి బంధవులు వాళ్ళను బానిసాన్నుండి విడిపించాలి — లేవీ 25, 47-49. ఈలాగే ఓ యూదుని యెవరైనా చంపినట్లయితే దగ్గరి బంధువులు శత్రువులమీద పగ తీర్చుకోవాలి - సంఖ్యా 35,19. ఈ అమ్ముడుపోయిన యూదుల ఆస్తిపాస్తుల నైతేనేం బానిసలుగా అమ్ముడుపోయిన యూదజనానైతేనేం విడిపించే దగ్గరి బంధువులూ, హత్యకు ప్రతిహత్యజేసి శత్రువులమీద పగతీర్చుకునే దగ్గరి బంధువులూ పూర్వవేదంలో "విమోచకులు" అని పిలువబడతారు. అనగా వీళ్ళ విడిపించేవాళ్లు లేక రక్షకులు అని భావం. ఇక యూదజనాని కంతటికీ విమోచకుడు, అన్ని అవసరాల్లోనూ వాళ్ళను విమోచించి కాపాడే దగ్గరిబంధువు