పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 276 P.pdf/263

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చేసిన సుందర సృష్టిని పాడుచేస్తుంది. కనుక మనం పాపానికి దూరంగా వుండాలి. సృష్టికర్తను స్తుతించాలి, అతడు చేసిన ప్రకృతినిగాంచి ఆనందించాలి.


105. యిస్రాయేలు చరిత్ర


యాజకులు, ప్రవక్తలు యెరూషలేము దేవాలయానికి వచ్చిన భక్తులకు యిస్రాయేలు చరిత్రను విన్పించేవాళ్లు, ఇది అలాంటి చారిత్రక కీర్తన. ప్రభువు అబ్రాహాముని ఎన్నుకొని అతనికి రెండు వాగ్గానాలు చేసాడు. అవి అతనికి కనాను దేశాన్ని దయచేయడమూ, విస్తారమైన సంతతిని ప్రసాదించడమూను. రెండు ప్రమాణాలు నెరవేరాయి. కనానులో కరవురాగా అబ్రాహాము సంతతి ఈజిప్టుకి వలసవెళ్ళింది. అక్కడ యోసేపు ప్రధాన మంత్రియై యిప్రాయేలీయులకు మేలుచేసాడు. కాని అతని తర్వాత రాజ్యమేలిన ఈజిప్టు రాజులు యిప్రాయేలీయులను పీడించారు. అహరోను మోషే అనే నాయకులు పది అద్భుతాలు చేసి ప్రజలను ఈజిప్టు నుండి వెడలించుకొని వచ్చారు. ఇది యీ కీర్తన చెప్పే రక్షణ చరిత్ర, మన వ్యక్తిగత జీవితంగూడ రక్షణ చరిత్రలో ఓ భాగమే. ప్రభువు ఆనాటి యిప్రాయేలీయులను వలె నేటి క్రైస్తవులనూ, స్వయంగా మనలనూ, నడిపిస్తూంటాడు. మనం మాత్రం ఆ ప్రభువు నడిపించినట్లుగా నడవాలి. నేడు అతడు మనకిచ్చే నాయకులను అంగీకరించాలి.


106. యిస్రాయెలు పశ్చాత్తాపం


ఈ కీర్తన కూడ యిప్రాయేలు చరిత్రను తెలిపేదే. ఎడారికాలంలో ఆ ప్రజలు చాలసార్లు దేవునిమీద తిరుగపడ్డారు. ఎద్దును ఆరాధించారు. మోషేను ఎదిరించారు. అన్యజాతి ప్రజలతో కలసిపోయారు. కనాను దేశం చేరి అక్కడ స్థిరపడిన పిదప బాలుదేవతను కొల్చారు. ఫలితంగా ప్రవాసానికి వెళ్ళారు. ఐనా ఆ ప్రజలు పశ్చాత్తాపపడగానే ప్రభువు దయగలవాడు కనుక తాను చేసిన నిబంధనను స్మరించుకొని వారి తప్పలను మన్నించాడు. ఆ యిప్రాయేలీయుల్లాగే నేడు మనం కూడ మాటిమాటికి పాపం చేస్తుంటాం. ఐనా దేవుడు తేపతేపకు మనలను మన్నిస్తుంటాడు. మన పశ్చాత్తాపంవల్ల దయగల దేవుడు మనలను రక్షిస్తూంటాడు. మన పశ్చాత్తాపం చిత్తశుద్ధితో కూడి వుండాలని వేడుకొందాం.


107. ఆపదల్లో ఆదుకొనే ప్రభువు


పూర్వం దేవుడు నాల్ల బృందాల ప్రజలను ఆపదలనుండి కాపాడాడు. ఆ నాల్ల బృందాలవాళ్లు దేవళంలో అర్పించిన కృతజ్ఞతాస్తుతులే ఈ కీర్తన. ఒక బృందం వాళ్లు ఎడారిలో చిక్కి అలమటిస్తూంటే దేవుడు వారిని కాపాడాడు. మరో బృందం వారు చెరలో చిక్కుకొనగా దేవుడు వారిని విడిపించాడు. ఇంకో మురావాళ్లు అంటురోగం