పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 276 P.pdf/262

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

102. కష్టాలలో ప్రార్ధన


ఇది విలాప కీర్తన, కష్టాలలో జిక్కిన భక్తుని మొర. ఈ భక్తుని వెతలు ఎలా వున్నాయంటే, అతడు బూడిద తింటున్నాడు. పానీయంలో తన కన్నీళ్లు కలుపుకొని త్రాగుతున్నాడు. అతని ఆయుస్సు సాయంకాలపు నీడలాగ తరిగిపోయింది. అతడు మొదట తన బాధలను గూర్చి దిగులుపడ్డాడు. తర్వాత యెరూషలేము నాశాన్నీ దేవాలయ విధ్వంసాన్నీ జ్ఞప్తికి తెచ్చుకొని శోకించాడు. సియోనును కనికరింపమని ప్రభువుకి మనవి చేసాడు. ఆ పిమ్మట ప్రభువు మహాశక్తినీ శాశ్వతత్వాన్నీ గుర్తుకి తెచ్చుకొన్నాడు. దేవుడు చేసిన భూమ్యాకాశాలు గతిస్తాయి. పాతబట్టలా చినిగిపోతాయి. కాని ప్రభువుకి నాశం లేదు. అతడు ఎల్లవేళల ఒకే రీతిగా వుంటాడు. మన కష్టాల్లో మనలను ఆదుకొనే శక్తిమంతుడైన ప్రభువు ఒకడున్నాడు. అతన్ని శరణు వేడితే మనకు మేలు కలుగుతుంది. కనుక "నీ మొగాన్ని నా నుండి మరుగుజేయకు" అని ఆ ప్రభువుని అడుగుకొందాం.


108. దేవుడు ప్రేమమయుడు


ఇది ప్రభువు కరుణను ప్రేమను కొనియాడుతూ వ్రాసిన స్తుతి కీర్తన. బైబుల్లోని మంచి కీర్తనల్లో వొకటి, భక్తుడు మొదట ప్రభువు తనకు చేసిన ఉపకారాలకు వందనాలు చెప్పాడు. దేవుడు అతని పాపాలను మన్నించి అతని వ్యాధులను నయం చేసాడు. అతన్ని గరుడపక్షిలాగ శక్తిసంపన్నుద్ధి చేసాడు. అటుపిమ్మట ప్రభువు ఈజిప్టులో బానిసలైయున్న యూదులకు చూపిన కరుణను వర్ణించాడు. ప్రభువు కరుణామయుడు, దీర్ఘశాంతుడు. మన పాపాలకు తగినట్లుగా మనలను శిక్షింపడు. అతని ప్రేమ ఆకాశమంత యెత్తు. తండ్రి కుమారులమీదలాగే అతడు మనమీద జాలిజూపుతాడు. మనం దుర్భలులమైన మట్టిమానుసులమని అతనికి బాగా తెలుసు. ఈలాంటి దేవుణ్ణి మనం కీర్తించి స్తుతించాలి. ఈ భక్తునిలాగే మనం కూడ "నా యాత్మమా ప్రభువు ఉపకారాలను వేటినీ మరువకు" అని చెప్పకోవాలి.


104. సృష్టిలోని వింతలు


ఇది లోకసృష్టిని వర్ణించే స్తుతికీర్తన, ఆదికాండంలోని తొలి రెండధ్యాయాలను జ్ఞప్తికి తెచ్చేది. చాల గొప్పకీర్తన. ప్రభువు భూమ్యాకాశాలనూ సముద్రాలనూ సృష్టించాడు. నీళ్ళలో, నేలమీద, ఆకాశంలో సంచరించే ప్రాణికోటినంతటినీ కలిగించాడు. ఈ విశ్వం అతడు చేసిన ప్రాణులతో క్రిక్కిరిసి వుంది. ఈ జీవరాశినంతటినీ అతడు సకాలంలో తిండిపెట్టి పోషిస్తుంటాడు. అతడు ఊపిరితీస్తే ప్రాణులు చస్తాయి. ఊపిరి పోస్తే, నూత్న ప్రాణులు పుడతాయి, అతడు రోజు భూమికి నూత్న జీవాన్ని ప్రసాదిస్తుంటాడు. మన * తరపున మనం అద్దంలో ప్రతిబింబంలాగ సృష్టిలో భగవంతుని రూపం గోచరిస్తుంది. పర్యావరణాన్ని ధ్వంసం చేయకూడదు. నరుల పాపం దేవుడు