పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 276 P.pdf/209

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పైమూడు ఉపమానాల్లోను భావం ఒకటే. మనలోని స్వార్ధం సమసిపోవాలి. స్వార్గాన్ని అణచుకోవాలంటే ఎంతో బాధగా వుంటుంది. కాని ఈ బాధద్వారానేగాని క్రీస్తు జీవాన్ని పొందలేం. మొదట మనం ఈ జీవాన్ని పొందితేనేగాని తర్వాత దాన్ని తోడిజనానికీ అందియలెం.

4. ప్రార్థనా భావాలు


 1. కురేనియా సీమోను సిలువను మోయడంలో ప్రభువుకి తోడ్పడ్డాడు - మత్త 27,32. ప్రభువుకి మన సహకారం అవసరం. పంటను సేకరించడానికి కోతగాళ్లు కావాలి. తీగలోని సారాన్ని పండ్లగా మార్చుకోవడానికి కొమ్మలుకావాలి. బిడ్డను లోకంలోకి ప్రవేశపెట్టడానికి తల్లికావాలి. ఆలాగే ప్రభువు ప్రారంభించిన రక్షణ ఉద్యమాన్ని కొనసాగించడానికి ప్రేషితులమైన మనంకావాలి. మనం దేవునితో సహకరించడానికీ, అతనితో కలసి పనిచేయడానికీ ఎన్నుకోబడినవాళ్లం. ఇది చాల గొప్ప పిలుపు. ఐనా ఆత్మ నిగ్రహంలేందే ఈ పిలుపు ఫలితమీయదు.

 2. పౌలు కొరింతీయులకు రెండవజాబు వ్రాసూ "యేసు జీవం మాలో నెలకొనేందుకై మాదేహంలో నిత్యం ప్రభుమరణాన్ని అనుభవిస్తున్నాం. మామరణం మీకు జీవాన్ని సంపాదించి పెడుతుంది" అని చెప్పాడు-2కొ 4, 10-12 పౌలు క్రీస్తు జీవాన్ని పొందడానికై ఆత్మనిగ్రహం అవలంబించాడు. నానా యాతనలూ అనుభవించాడు. కాని పౌలు బాధలద్వారా అతని విశ్వాసులకు వరప్రసాదం లభించింది. ఆలాగే మనంకూడ సాంతజీవితానికి చనిపోతేనేగాని యేసుజీవితం మనలో బలపడదు. ఈలా బలపడిన యేసు జీవితమే మననుండి వేరేవాళ్లను చేరుతుంది. కనుక మనం రోజురోజుకీ మన సాంతరూపాన్ని మార్చుకొని క్రీస్తు రూపాన్ని పొందుతూండాలి.

3. అంతియోకయ మేత్రాణులైన యిన్యాసివారు రెండవ శతాబ్దిలో వేదసాక్షిగా మరణించారు. ఆ భక్తుణ్ణి రోములోని సింహాలకు మేతగావేయగా ఆ వన్యమృగాలు అతన్ని పెళపెళవిరుచుకొని తిన్నాయి. ఆ సమయంలో ఆయన "నేను స్వామి కొరకు ఉద్దేశింపబడిన గోదుమధాన్యాన్ని ఈ వన్యమృగాల కోరల్లో పిండిపిండిగా నలిగి క్రీస్తుయొక్క అప్పంగా మారిపోతాను" అనిచెప్పకొన్నాడు. క్రీస్తుకోసం శ్రమలనుభవించడమంటే యిది. పూజలో అప్పరసాలు ప్రభు శరీరరకాలుగా మారిపోతాయి. ఈ యప్పరసాలు నిగ్రహానికీ శ్రమజీవితానికీ చిహ్నాలు. మనం పూజను సమర్పించి ప్రభుని ఆరాధించుకొనేపడెల్లా ఈ నిగ్రహమనే భాగ్యాన్ని అడుగుకొంటూండాలి.

 4. ట్రేజన్ అనే అతని ఓ రోమను చక్రవర్తి అతడు రాజ్యవ్యవహారాలన్నీ వదలివేసి తూనీగలను బట్టుకొంటూ కాలక్షేపం చేసేవాడట. కొంతమంది గురువులూ మటీకన్యలూ
201