పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 276 P.pdf/210

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఈ చక్రవర్తిలాగే నిరర్ధకజీవితం గడుపుతూంటారు. మనం చేయవలసిన సత్కార్యాలు ఎన్నెనావున్నాయి. ప్రజలకు ఎన్నోవిధాల మేలుచేయవచ్చు. ఐనా అర్థంలేని వ్యర్థజీవితంతో కాలక్షేపం చేస్తూంటాం.

8. మోక్షభాగ్యం ధ్రువం


 ప్రభువు మనలను పిల్చాడుగదా! ఆ పిలుపుకు తగినట్లుగా జీవించేవాళ్లకు మోక్షభాగ్యమిస్తానని ప్రభువు చాలావాక్యాల్లో ప్రమాణంచేసాడు. ఆలాంటి వాక్యాలను మూడింటిని పరిశీలిద్దాం.

1. ఇక్కడ నూరంతలూ, అక్కడ నిత్యజీవమూ


“నా నిమిత్తం ఇలూ వాకిలినీ సోదరీసోదరులనూ తల్లిదండ్రులనూ పొలమూపుట్రానూ పరిత్యజించినవాళ్ళు నూరురెట్ల పొందుతారు, నిత్యజీవానిని ప్రభువు ధనవంతుడు మోక్షాన్ని చేరుకోవడంకంటె ఒంటె సూదిబెజ్జంగుండా దూరిపోవడం సులభమని చెప్పాడు. అపుడు పేత్రు మేము సర్వం పరిత్యజించి నిన్ననుసరించాం గదా, మరి మాకేమి లాభం కలుగుతుందో చెప్పమన్నాడు. దానికి ప్రభువు చెప్పిన జవాబే పైవాక్యం.
 2. నియమం. మనకు ప్రియమైన వాటినన్నిటినీ ప్రభువు కోసం వదలివేయాలి. అనగా క్రీస్తురాజ్యంకోసం బంధువులనూ ఆస్తిబాస్తులనూ పరిత్యజించాలి. ఈలా వదలివేసినవాటిని మల్లా ఆసించగూడదు, యూదాలాగ.
 3. భావం, వాళ్ల వదలింది బంధువులనూ ఆస్తిబాస్తులనూ, కాని వీటికి బదులుగా వాళ్లు పొందేవిమాత్రం చాలావున్నాయి, ఇక్కడ నూరంతలుగా పొందుతారు. ఒక్క ఇంటివద్ద ఆస్తిబాస్తులను వదలివేసివచ్చినా మనకు గురుజీవితంలోను కన్యాజీవితంలోను కూడూగుడ్డా యిలల్లవాకిలీ కరువైపోవు. ఇది కాక, ప్రభువుకోసం త్యాగంజేసినవాళ్లు అక్కడ నిత్యజీవం పొందుతారు. నిత్యమరణాన్ని తప్పించుకొంటారు.
 4. అన్వయం. ప్రభువు ఆనాడు అపోస్తలులకు చెప్పిన వాక్యమిది. వాళ్ల పనిని కొనసాగించే మనకుగూడ ఈనాడు ఈవాక్యం అక్షరాల వర్తిస్తుంది. మనంమాత్రం చేసిన త్యాగానికి భంగం కలిగించగూడదు. ఆ వదిలివేసినవాటిని మల్లా ఆసించగూడదు. మనం మనత్యాగాన్ని నిలుపుకొంటే, దేవుడు తన ప్రమాణాన్ని నిలుపుకొంటాడు.
202