పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 276 P.pdf/196

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నియమించాడు. ఆయన నేను నమ్మదగినవాజ్ఞని ఎంచాడు. దీనికిగాను నేను అతనికి కృతజ్ఞణ్ణి" అని వ్రాసికొన్నాడు. మనలనుగూడ ప్రభువు నమ్మదగిన వాళ్లనుగా ఎంచాడు. కనుకనే మనలను పిల్చాడు. ప్రభువుకి మనమీద వున్న ఈ సదభిప్రాయాన్ని నిలబెట్టుకొనే బాధ్యత మనది. - 1 తిమొ 1, 12-13

4. కీర్తనకారుడు "ప్రభో! నేను నీ దాసుడ్డి నీ దాసురాలి కుమారుణ్ణి" అని చెప్పకొన్నాడు - కీర్త 116, 16. ఈ భక్తునిలాగే మంనకూడ ప్రభువుపట్ల కృతజ్ఞలమైయుండాలి. ప్రభో! నేను నీవాణ్ణి. నీవాణ్ణిగా వండాలనే నా కోరిక అని చెప్పకొంటూండాలి

3. పిలుపు

"ప్రభువు తన కృపచేత నన్నుపిలిచాడు" అని చెప్పకొన్నాడు పౌలు. ఈ పిలుపు ఏలావుంటుందో పరిశీలించి చూద్దాం.

1. పిలుపు ముగ్గురు దైవవ్యక్తులనుండి

కఫర్నాములో ప్రభువుచెప్పిన మాటలనుబట్టి ఈపిలుపు తండ్రివద్దనుండి లభిస్తుంది. "నన్ను పంపిన తండ్రి ఆకర్షిస్తేనేతప్ప ఎవరూ నావద్దకు రాలేరు" అన్నాడు ప్రభువు - యోహా 6,44, ఆలాగే పిలుపు క్రీస్తువద్దనుండి కూడాను. "మీరు నన్ను ఎన్నుకోలేదు, నేనే మిమ్మ ఎన్నుకొన్నాను"- యోహా 15, 16. ఇక పిలుపు పరిశుద్దాత్మనుండిగూడ. "అంతియోకయలోని ప్రవక్తలూ బోధకులూ ప్రభుని సేవిస్తూ ఉపవాసం చేస్తూన్నారు. అప్పడు పవిత్రాత్మడు నాపనికై సౌలునూ బర్నబానూ ప్రత్యేకించండని వాళ్లతో చెప్పాడు" - అకా 132. ఈ రీతిగా మన పిలుపు ముగ్గురు దైవవ్యక్తులనుండి వచ్చింది. కనుక మనం దాన్ని ఎంతో విలువతో చూచుకోవాలి. శ్రేష్టమైన ప్రతివరమూ, సంపూర్ణమై ప్రతిబహుమానమూ జ్యోతిర్మయుడైన తండ్రి వద్దనుండే వస్తుంది - యాకో 1,17. మన పిలుపుగూడ ఈలాంటి వరమేగనుక మనం ఆ తండ్రికి కృతజ్ఞలమై యుండాలి.

2. పిత కానుకను క్రీస్తు స్వీకరిస్తాడు

పిత నాకనుగ్రహించిన వాళ్లంతా నా చెంతకువస్తారు అన్నాడు ప్రభువు - యోహా 6,37. పిలువబడినవాళు పితచే ప్రత్యేకంగా ఆకర్షింపబడినవాళ్లు, పితకు చెందినవాళ్లు, పిత వీళ్లను క్రీస్తుకు కానుకగా సమర్పిస్తాడు. తండ్రియిచ్చే ఈ కానుకపట్ల క్రీస్తుకు ఆదరం ఎక్కువ. ఎందుకంటే క్రీస్తు తరువాత అతడు ప్రారంభించిన ప్రేషిత ఉద్యమాన్ని కొనసాగించేది వీళ్లే. అంచేత క్రీస్తుకి వీళ్లంటే యెంతోప్రేమ. కనుకనే అతడు "నా వద్దకు వచ్చినవాళ్లను నేను ఎంతమాత్రమూ నిరాకరించను" అన్నాడు - యోహా 6,37. ఈ వాక్యం మనకెంతైనా ఊరట నీయాలి.