పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 276 P.pdf/195

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

భాగ్యాన్ని మనకిచ్చాడు. మనకే యెందుకీయాలి? మనకు తెలీదు. ప్రభువు తన భక్తుడైన మోషేతో "నేను నాయిష్టం వచ్చినవాళ్లను కటాక్షిస్తాను. నేను కోరుకొన్నవాళ్లకు కరుణ చూపుతాను" అన్నాడు - నిర్గ 33,19. ప్రభువు సంకల్పం ఆలాంటిది, అంతే

     2. "ఆనాది కాలంనుండీ" అనాది కాలంనుండి గూడ ప్రభువు మనలను ప్రేమిస్తూ వచ్చాడు. అందుకే అతడు యిర్మీయాతో "నేను నిన్ను శాశ్వతప్రేమతో ప్రేమించాను, నా ప్రేమ నీపట్ల స్థిరంగా వుంటుంది" అని చెప్పాడు -యిర్మీ 31,3. కనుక అనాది కాలం నుండే ప్రభువు మనలను తలంచుకొన్నాడు, జ్ఞాపకముంచుకొన్నాడు, ప్రేమించాడుగూడ, ప్రభువుచూపిన ఈ యాదరాభిమానాలకు మనమెంతైన కృతజ్ఞలమై యుండాలి. కీర్తనకారునిలాగే మనంకూడ "ప్రభువు నాకుచేసిన ఉపకారాలకు నేను ప్రత్యుపకారమేమి చేయగలను?" అనుకోవాలి. - కీర్త 116,12
     3. "యేసుక్రీస్తునందు". ప్రభువు క్రీస్తుద్వారా మనకు ఈ యెన్నిక అనే భాగ్యాన్నిచ్చాడు. ఇది మన గొప్పనుబట్టికాదు, క్రీస్తునిజూచి. మనం అతనిలోనికి జ్ఞానస్నానం పొందుతామనీ, అతని తమ్ముళ్ళమూ చెల్లడ్లమూ ఔతామని తెలిసికొని తండ్రి మనలను ఎన్నిక చేసాడు. కనుక మన సౌభాగ్యమంతా క్రీస్తునందే 4. "మనకు అనుగ్రహింపబడిన వరప్రసాదంద్వారానే". మనం పుట్టకముందే ఈ వరప్రసాదం మనకోసం సంసిద్ధమై వుంటుంది. మనకోసం కాచుకొని వుంటుంది. మనం పుట్టగానే అది మనమీద బలంగా పనిచేస్తుంది. మనలను ఆ ప్రభువువైపు ఆకర్షిస్తుంది. ఎన్నికఅంటే యిదే. ధనికులయింటిలో పట్టే బిడ్డకు తల్లిదండ్రుల సిరిసంపదలు అబ్బుతాయిగదా! ఆలాగే దేవునివలన ఎన్నికైన భక్తులకు చిన్ననాటినుండే అతని వరప్రసాదం విరివిగా లభిస్తుంది.

4 ప్రార్థనా భావాలు

     1. క్రీస్తు శిష్యులను ఎన్నుకోవడాన్ని గూర్చి చెపూ మార్ముసువార్త "అతడు కొండయెక్కి తనకిష్టమైనవాళ్లను పిలువగా వాళ్లు అతనివద్దకు వచ్చారు" అని చెప్తుంది - 3, 13. ప్రభువు ఎన్నుకొనేవాళ్లు అతనికి యిపులు. ప్రభువు మనలనుగూడ ఎన్ను కొన్నాడు అంటే, మరి మనంగూడ అతనికి యిపులమనే భావం.
      2. యిర్మీయా, పౌలూ మేము మాతృగర్భంలో వున్నపుడే ప్రభువు మమ్మ ఎన్నుకొన్నాడు అని భావించి సంతృప్తిచెందారు. మనకూ ఇదే భావన వుండాలి. మన పిలుపు యాదృచ్ఛికమైంది గొదు, ప్రభువు బుద్ధిపూర్వకంగా నిర్ణయించింది. ఈ భావం మనకెంతైనా సంతృప్తినీ ధైర్యాన్నీ కలిగించాలి.
     3. పౌలు తన పిలుపునీ పూర్వ పాపజీవితాన్నీ గూర్చి చెప్పకొంటూ "పూర్వము దూషకుడనూ హింసకుడనూ హానికరుడనూ ఐయున్న నన్ను ప్రభువు తన పరిచర్యకు