పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 276 P.pdf/187

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

38. పరిశుద్దాత్మ మనకు వరాలనిస్తుంది. ఈ వరాల్లో వొకటి ఏవి సదాత్మలో ఏవి దుష్టాత్మలో గ్రహించేలా చేస్తుంది. అనగా సదసదాత్మ వివేచనం పరిశుద్ధాత్మవరం - 1కొ 12,10, పరిశుద్దాత్మా అపరిశుద్దాత్మా నిప్పూ నీళూ లాగ ఒక దానితో ఒకటి కలియవు. అపరిశుద్దాత్మ వున్న కాడ పరిశుద్దాత్మ వుండదు. అలాగే పరిశుద్ధాత్మ వున్న కాడ అపరిశుద్దాత్మ వుండలేదు. ఈ యాత్మలు మనలను నడిపించే తీరు తెలిసికోవాలంటే మొదట మనతరపున మనకు కొంత జాగ్రత్తా ఆలోచనా వుండాలి. ఈ వరాన్ని ప్రసాదించమని ఆత్మను ప్రార్ధించాలి గూడ. మన జీవితంలో ఏయాత్మ ఏతీరుగా ప్రవర్తిస్తుందా అని ఆలోచించి చూచి కొంత అనుభవం గడించాలి. మొత్తం మ్మిద సదసదాత్మ జ్ఞానమనేది కొంత కృషి చేసి సాధించదగిన ఉత్తమ వరం.

39. పరిశుద్దాత్మ నడిపించే వాళ్లల్లో కొన్ని లక్షణాలుంటాయని చెప్పాడు పౌలు. ఈ లక్షణాలను అతడు “ఆత్మఫలాలు" అని పేర్కొన్నాడు. అవి ప్రేమ, సంతోషము, సమాధానము, సహనము, దయ, మంచితనము, నమ్మనగిన తనము, వినయము, ఇంద్రియ నిగ్రహము- గల 5,22. కనుక ఈ లక్షణాలు మనలో వుంటే ఆత్మ మనవిూద పనిచేస్తుందని రూఢిగా చెప్పవచ్చు. ఈలాగే పిశాచం నడిపించే వాళ్లల్లో పిశాచలక్షణాలు కన్పిస్తాయి. వాటిని గూడ పౌలు పేర్కొన్నాడు. అవి జారత్వము, అపవిత్రత, చెడునడత, విగ్రహారాధనము, మాంత్రిక క్రియలు, ద్వేషము, కలహము, మత్సరము, క్రోధము, స్వార్థము, కక్షలు, వర్గాలు, పక్షాలు, త్రాగుబోతుతనము, అల్లరిపనులు. ఈ లక్షణాలను బట్టి మనమిూద పిశాచ ప్రభావం ఎంతగా వుందో గుర్తించవచ్చు - గల 5,19-21. సదసదాత్మల ప్రభావాన్ని పరిశీలించి తెలిసికోగోరేవాబ్లాకి ఇంతకంటె స్పష్టమైన లక్షణాలు నూతవేదంలో మరెక్కడా కన్పించవనే చెప్పాలి.

40. పౌలు చాలతావుల్లో క్రైస్తవ సమాజాన్ని ఓ దేవాలయంతో పోల్చాడు. ఈ దేవాలయానికి పునాదిరాయి క్రీస్తే క్రైస్తవులంతా ఈ పునాది రాతిమిూద సజీవ శిలలుగా అమర్చబడతారు, వాళ్లంతా కలసి ఓ దేవాలయంగా తయారౌతారు - ఎఫే 2,20-22, ఇక, మనమెప్పడూ ఈ క్రైస్తవ సమాజ నిర్మాణానికి పూనుకోవాలే గాని దాన్ని ధ్వంసం చేయగూడదు, కొంతమంది ఈ సమాజంలో చీలికలు తెచ్చిపెడుతూంటారు. దాని ద్వారా సమాజం నాశమైపోతుంది. ఈలాంటి వాళ్లను పిశాచం నడిపిస్తుందనే చెప్పాలి. క్రైస్తవ సమాజ నిర్మాణంలాగే సోదరప్రేమ కూడ చాల ముఖ్యమైంది. ఓ ప్రాచీన రోమను సామెత "నరునికి నరుడు తోడేలు" అని చెప్తుంది. నరులు స్వార్థం కొద్దీ ఒకణ్ణి ఒకడు పీకుకొని తింటుంటారు. ఈలాంటి పరిస్థితుల్లో దేవుడు పరిశుద్దాత్మ ద్వారా తన ప్రేమను మన