పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 276 P.pdf/188

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

హృదయాల్లో కుమ్మరిస్తూంటాడు - రోమా 5,5. కనుక ఎవరు సోదర ప్రేమతో జీవిస్తుంటారో వాళ్లను పరిశుద్ధాత్మ నడిపిస్తున్నట్లు. ఎవరు సోదర ప్రేమ విూరి తోడేళ్లలాగా ప్రవర్తిస్తుంటారో వాళ్లను అపరిశుద్దాత్మ నడిపిస్తున్నట్లు,

41. యోహాను మొదటి జాబు 2,20 వచనమూ, 2,27 వచనమూ దేవుని ఆత్మ మన హృదయాలను అభిషేకిస్తుందని వాకొంటుంది. ఇక్కడ ఆత్మ మన హృదయాలను అభిషేకించడమంటే, మనకు క్రీస్తు పట్ల విశ్వాసం పట్టించడమే. అతని బోధలను మనం అర్థం చేసికొనేలా చేయడమే. అతని జీవితాన్ని విశేషంగా మరణాన్నీ ఉత్తానాన్నీ మనం అంగీకరించేలా చేయడమే. ఈ భావమే యోహాను సువార్త 16,12-14 వాక్యాల్లో గూడ కన్పిస్తుంది. పరిశుద్ధాత్మ దిగివచ్చి శిష్యులను సంపూర్ణ సత్యంలోనికి నడిపిస్తుంది. ఇక్కడ సంపూర్ణ సత్యమంటే క్రీస్తే, అనగా ఆత్మ వచ్చి శిష్యులు క్రీస్తుని బాగుగా అర్థం చేసికొనేలా, అతన్ని పూర్ణ హృదయంతో అంగీకరించేలా చేస్తుంది. ఆత్మ క్రీస్తు బోధలనే గైకొని వాటిని మల్లా శిష్యులకు బోధిస్తుంది. ఆ బోధల భావాన్ని విప్పి చెప్తుంది. కనుక ఆత్మచే నడిపింపబడేవాళ్లకు మన క్రైస్తవ మతసత్యాల పట్ల ఆసక్తి కలుగుతుంది. బైబులు మిూద కోరిక పడుతుంది. క్రీస్తు జీవిత పరమార్గాన్నీ అతని బోధల భావాన్నీ అధికాధికంగా తెలిసికొందామనే ఆశ జనిస్తుంది. ఈ కోరిక గూడ కేవలం జ్ఞానం కొరకు గాదు, భక్తి కొరకు. ఆచరణం కొరకు. అందుచేత మనం ఈ యాత్మ అభిషేకం కోసం ప్రార్థిస్తూండాలి.

42. ఆత్మ మనకు చేసే ప్రధానమైన సేవ ఒక్కటే ఒక్కటి - మనలను ఆ క్రీస్తు వద్దకు తోడ్కొని పోవడం. ఆ ప్రభువుతో జోడించడం. ఈ కార్యాన్నే ఆత్మ నానా రూపాల్లో చేస్తుంది. "నన్ను పంపిన తండ్రి ఆకర్షిస్తేనే తప్ప ఎవడూ నా యొద్దకు రాలేడు" అనే క్రీస్తు వాక్యం ఒకటుంది - యోహాను 6,44. ఈ యాకర్షణే పరిశుద్దాత్మ అనగా తండ్రి పరిశుద్దాత్మ ద్వారా మనలను క్రీస్తు వద్దకు రాబట్టు కొంటూంటాడు. ఆత్మ మనలను క్రీస్తు వద్దకు చేరుస్తూంటుంది. ఈ యాత్మ అనుగ్రహం లేందే మనం యేసు ప్రభువు అని అంగీకరించలేమన్నాడు పౌలు - కొరి 12,3. ఈ వాక్యంలో "ప్రభువు" అంటే దేవుడని భావం. కనుక మనం క్రీస్తు దేవుడని విశ్వసించేది గూడ పరిశుద్దాత్మ ద్వారానే. ఈ యాత్మ మన హృదయం విూద క్రీస్తు రూపురేఖలు చిత్రిస్తుంది. క్రీస్తు పట్ల భక్తిని కలిగిస్తుంది.

43. క్రీస్తు అనుసరణ గ్రంథం 3,54 మానవ ప్రకృతితో నడిచేవాళ్లు కొందరూ, దైవ వరప్రసాదంతో నడిచేవాళ్లు కొందరూ అని చెప్తుంది. ఈ యిరుతెగల వాళ్ల లక్షణాలను చాల పేర్కొంటుంది. వాటిలో కొన్నిటిని ఈ క్రింద ఉదాహరిస్తున్నాం. ఇక్కడ మానవ ప్రకృతి అంటే పిశాచ ప్రబోధం, దైవ వరప్రసాదమంటే పరిశుద్దాత్మ ప్రబోధం. సాధకులు ఈ యధ్యాయాన్ని జాగ్రత్తగా చదివి చూడండి. మిమ్మేయాత్మ నడిపిస్తుందో మికే బోధపడుతుంది.