పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 276 P.pdf/186

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వెళ్తాడు. ఆ రెండవ నాయకుడు మొదటి నాయకుడు ప్రారంభించిన పనిని కొనసాగించుకొని పోతాడు. మోషే దాటిపోతూ యోషువాని నాయకుణ్ణిగా నియమించాడు. యోషువా యిస్రాయేలు ప్రజలను వాగ్రత్త భూమికి చేర్చాడు. యేలీయా దాటిపోతూ యెలీషాను ప్రవక్తగా నియమించాడు. అలాగే క్రీస్తు దాటిపోతూ పరిశుద్దాత్మను నాయకునిగా నియమించాడు. కనుక క్రీస్తు నెలకొల్పిన క్రైస్తవ సమాజాన్ని ఈయాత్మ నడిపిస్తూంటుంది. తండ్రి వద్దకు చేర్చుతూంటుంది. ఒకవైపు పిశాచం బిడ్డలను పిశాచం నడిపిస్తుంటుంది. మరోవైపు దేవుని బిడ్డలను దేవుని ఆత్మ నడిపిస్తూంటుంది - రోమా 8,14.

36. పరిశుద్దాత్మభక్తులను నడిపిస్తుందని చెప్పాం. కొన్ని ఉదాహరణలు చూద్దాం. మరియు బాలయేసును దేవాలయంలో అర్పించడానికి వెళ్లినపుడు ఆత్మ సిమియోను అనే వృద్దుని నడిపించుకొని వచ్చింది. అతడు క్రీస్తును దర్శించిందాకా కన్నుమూయడని ఆత్మ అతనికి హామిగా యిచ్చింది- లూకా 2,25-28, అలాగే ఆత్మ గ్రీకు ప్రజలకు సువార్తను బోధించడానికై అంటియోకయ నుండి పౌలును బర్నబాను కొనిపోయింది - అచ 13 2–4 పౌలు మూడవ ప్రేషిత ప్రయాణంలో వుండగా యెరూషలేములో అతని కోసం శ్రమలు కాచుకొని వున్నాయని ఆత్మ అతనికి ముందుగానే ఎరుకపరిచింది-20, 22-33. రథంమిూద కూర్చుండి యెషయా ప్రవచనాన్ని చదువుకొంటూ పోతూన్న యితియోపీయుని వద్దకు ఫిలిప్పని నడిపించుకొని వచ్చింది- 8,29. యెరూషలేము లోని తొలి క్రైస్తవ సమాజానికి ఏద్దరు డీకన్ల నాయకులుగా వ్యవహరించారు. వాళ్లల్లో ఒకడైన సైఫను ఆత్మచే ప్రబోధితుడై వేదసాక్షిగా మరణించాడు-7,55, ఈలా ఆత్మ నిత్యం తన భక్తులను నడిపిస్తూనే వుంటుంది.

37. ఇటీవల మన కాలంలోనే ఆత్మ జాన్ పోపుగారిని నడిపించింది. ఈ మహానుభావుడు క్యాతలిక్ సమాజానికి పట్టిన బూజులు తుడిచివేయాలని సంకల్పించుకొన్నాడు. కాని ఆ తొలిరోజుల్లో ఇతర క్యాతలిక్ అధికారులు ఈయనతో అట్టే సహకరించలేదు. అపుడు ఈ పుణ్యపురుషుని హృదయంలో ఓ ఆవేదనం మంటలా మండేదిట. "నీవు క్రైస్తవ సమాజాన్ని సంస్కరించాలి సుమా!" అనే ప్రబోధం అతని అంతర్మాతలో విన్పించేదట. ఆ భక్తుడు అది పరిశుద్దాత్మ ప్రబోధమని గుర్తించాడు. ఆ ముసలి ప్రాయంలో రెండవ వాటికన్ సమావేశం ప్రారంభించాడు. మన క్యాతలిక్ సమాజానికి ఆయన చేసిన ఉపకారం అంతా యింతా కాదు. మొదటి పెంతెకోస్తు తర్వాత వాటికను సమావేశము వంటి సంఘటనం మరొకటి క్రైస్తవ చరిత్రలో లేనేలేదని విజ్ఞల అభిప్రాయం. మన దౌర్భాగ్యమా అంటూ ఈ వాటికను సభ నిర్ణయాలూ సంస్కారాలూ నేటివరకూ మనదాకా రానేలేదు. ఆ జాను భక్తుని హృదయం ఓ మంటలా రాజకొంటూండేదని చెప్పాం. పూర్వం యిర్మీయా ప్రవక్తకు గూడ యిూలాంటి అనుభవమే వుండేది - యిర్మీ 20,9. భక్తులైనవాళ్లని ఆత్మ నడిపించే తీరు ఈలా వుంటుంది.