పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 276 P.pdf/184

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కోరుకొన్నాడు. కడకు ఉట్టికీ స్వర్గానికీ గూడ పనికిరాకుండా పోయాడు-యోహా 12,6. ఈలా ప్రవర్తిస్తే పరిశుద్దాత్మ ప్రభోదాన్ని నిరాకరించి దుష్టాత్మ ప్రబోధానికి లొంగిపోయినట్లే

31. ప్రభువు "మిూరు చిన్నబిడ్డలవలె నైతేనే తప్ప పరలోక రాజ్యంలో ప్రవేశింపలేరు" అన్నాడు-మత్త 18,3. ఇక్కడ చిన్నబిడ్డల వలె కావడం అంటే యేమిటి? మనం ప్రాయంలో చిన్నబిడ్డలం కాలేం. కాని మనస్తత్వంలో కాగలం. బిడ్డ మనస్తత్వానికీ పెద్దవాళ్ల మనస్తత్వానికీ చాలా భేదముంటుంది. పెద్దవాళ్లు ఇతరుల విూద అట్టే ఆధారపడరు. తమంతటతాము నిలువగలరు. కాని చిన్నబిడ్డలు నిత్యమూ తల్లిదండ్రుల విూద ఆధారపడతారు. క్రీస్తు నిత్యమూ తన తండ్రిమిూద ఆధారపడి జీవించాడు. అలాగే మనం కూడ ఆ తండ్రి విూద ఆధారపడి జీవించాలని బోధించాడు. కనుక పసిబిడ్డల వలె కావడమంటే దేవుని మిద ఆధారపడ్డమే. వినయం గల నరుడు దేవుని విూద ఆధారపడి జీవిస్తాడు. కాని గర్వాత్ముడు దేవుని విూద ఆధారపడ్డానికి ఒప్పకోడు. నాకు నేను చాలుదు ననుకొంటాడు. వినయాత్మలను పరిశుద్ధాత్మా గర్వాత్మలను అపరిశుద్దాత్మా నడిపిసూంటుంది.

32. పైన 29వ అంశంలో క్రీస్తు పేత్రుని "సైతానూ నా యెదుట నుండి తొలగిపో" అని మందలించాడని చెప్పాం - మత్త 16,23. ఇక్కడ క్రీస్తు పేత్రుని "సైతానూ" అని పిలవడంలో భావమేమిటి? ప్రభువు తాను యెరూషలేములో బాధలనుభవించి సిలువ మిూద మరణించాలి అని శిష్యులకు బోధించాడు. ఆ బోధ పేత్రుకు నచ్చలేదు. అతడు క్రీస్తుని ప్రక్కకు తీసికొనిపోయి ఈలాంటి మరణం నీకు ప్రాప్తించకుండా వుండాలి అని పల్మాడు. అనగా పేత్రు క్రీస్తు మరణాన్ని అర్థం చేసికోలేదు. క్రీస్తు సుఖాలు అనుభవించాలే గాని కష్టాలు అనుభవించ గూడదని అతని భావం. క్రీస్తుకు ఈ బోధచేయమని పిశాచమే అతన్ని ప్రోత్సహించింది. క్రీస్తు తన సిలువను నిరాకరించి తండ్రి చిత్తానికి వ్యతిరేకంగా పోవాలని పిశాచం ఈవరకే యెడారిలో శోధించింది. అక్కడ తాను నెగ్గలేక ఇప్పుడు పేత్రుద్వారా ప్రభుని శోధిస్తుంది. అందుకే ఈ శోధనను అర్థం చేసికొన్న ప్రభువు ఇక్కడ పేత్రుని "సైతానూ" అని పేర్కొన్నాడు. ఇక, క్రీస్తు మొదట సిలువ మరణం అనుభవించి ఆ పిమ్మట పునరుత్తానుడైనవాడు. అతని శిష్యులమైన మనం కూడ మొదట బాధలనుభవిస్తేనేగాని అటుపిమ్మట మహిమను పొందలేం. ఎవరు సిలువను నేర్పుతో తప్పించుకో జూస్తూంటారో వాళ్లను నడిపించేది పిశాచమే.

33. పై సన్నివేశం లాంటిదే మరొకటుంది. ఉత్తాన క్రీస్తు ఇద్దరు శిష్యులతో ఎమ్మావు గ్రామానికి వెళ్తున్నాడు. వాళ్లకు అతడే క్రీస్తని తెలీదు. ఆ శిష్యులు క్రీస్తు రోమను రభుత్వంతో యుద్ధం చేసి పాలస్తీనా దేశానికి స్వాతంత్ర్యం సంపాదించి పెడతాడనీ, అతడు రాజకీయాల్లో జోక్యం జేసుకొనే మెస్సీయా అనీ నమ్మారు. కాని క్రీస్తు అలాంటి - 176