పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 276 P.pdf/185

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పనేమి చేయకుండానే చనిపోయాడు. అంచేత వాళ్ల ఆశలన్నీ అడియాసలైపోయాయి. వాళ్ల మొగాలు చిన్నవోయాయి. ఈలాంటి శిష్యులను మందలిస్తూ ప్రభువు "క్రీస్తు మొదట శ్రమలనుభవించి అటుపిమ్మట మహిమలో ప్రవేశించుట అగత్యం కాదా" అని హెచ్చరించాడు - లూకా 24,26. ఇది మహావాక్యం. క్రీస్తుకు మొదట శ్రమలూ అటుపిమ్మట మహిమాను. గురువు కొక త్రోవా శిష్యుల కింకొక త్రోవా అంటూ లేదు. మనం కూడ ఆ గురువు లాగే మొదట సిలువ మోయాలి. అటుపిమ్మట మోక్షమహిమను పొందాలి. కనుక మన ఆధ్యాత్మిక జీవితం సిలువ - ఉత్తానం అనే రెండు స్తంభాల విూద ఆధారపడి నిలుస్తుంది. ఈ సత్యాన్ని గ్రహించి జీవితంలోని శ్రమలను మంచి మనసుతో అంగీకరించే మహానుభావాలను పరిశుద్దాత్మ నడిపిస్తూందని చెప్పాలి.

34. క్రీస్తు చెప్పిన ఇంకో వాక్యం గూడ ఇదే భావాన్ని తలంపునకు తెస్తుంది. ప్రభు శిష్యుడు కాగోరేవాడు తన్ను తాను నిగ్రహించుకోవాలి, ప్రభు సిలువను మోసూ ఆయన్ని అనుసరించి వెళ్లాలి - మత్త 16,24. ఈ మహావాక్యం మూడు భావాలను బోధిస్తుంది. మొదటిది, క్రీస్తు శిష్యుడు తన్నుతాను నిగ్రహించుకోవాలి. తన్ను తాను జయించుకోవాలి. అనగా అతడు తన్ను తాను నిరాకరించుకొని క్రీస్తునే తన సర్వస్వంగా ఎన్నుకోవాలి. రెండవది, క్రీస్తు సిలువను మోయడానికి సంసిద్దుడు కావాలి. ఇక్కడ సిలువంటే రకరకాల శ్రమలూ, మరణమూను. వీటిని హృదయపూర్వకంగా అంగీకరించినవాడే క్రీస్తు భక్తుడు. మూడవది, క్రీస్తును అనుసరించాలి. అనగా అతని శిష్యుడు కావాలి. క్రీస్తునాడు యూదుల రబ్బయుల శిష్యులు వాళ్ల గురువుల బోధలను నేర్చుకొని వాటిని తూచ తప్పకుండ భావితరాలవాళ్లకు అందించిపోయారు. కాని క్రీస్తు శిష్యులకు ఈ మాత్రం చాలదు. వాళ్లు క్రీస్తు బోధలను ఆలించడం మాత్రమే గాదు. అచ్చంగా అతనిలాగే జీవించాలి. విశేషంగా అతనిలాగే పరలోకంలోని తండ్రి విూద ఆధారపడి మనుగడ సాగించాలి. ఆ తండ్రిపట్ల బిడ్డల్లా మెలగాలి. ఈ నియమాలను పాటించేవాళ్లే యధార్థమైన క్రీస్తు శిష్యులు. వాళ్లే దేవుని ఆత్మచే నడిపింపబడే దైవపత్రులు. మనం పరిశుద్ధాత్మచే నడిపింపబడుతున్నామో లేదో తెలిసికోగోరే వాళ్లకు ఇది పరీక్షావాక్యం. క్రైస్తవ శిష్యుని కుండవలసిన లక్షణాలను గూర్చి ప్రస్తావించేపుడు దీనికంటే గొప్పవాక్యం మరొకటి క్రీస్తు బోధల్లో కన్పించదు.

8. పరిశుద్ధాత్మ నడిపించే తీరు

85. క్రీస్తు శిష్యులతో ఉన్నంతకాలం అతడే వాళ్లకు ఆదరణ కర్త క్రీస్తు. ఉత్థానమైవెళ్లిపోయాక అతని ఆత్మ శిష్యులకు ఆదరణకర్తగా వచ్చింది. యూద ప్రజలసంప్రదాయాన్ననుసరించి ఒక నాయకుడు దాటిపోతూ మరొక నాయకుణ్ణి నియమించి