పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 276 P.pdf/183

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

28. ప్రభువు మనలను నడిపించే తీరులో ఇంకో విషయం గూడ వుంది. మనం పెద్దల అధికారానికి లొంగి వుండాలి. డమస్కు మార్గంలో ప్రభువు పౌలు మనసును మార్చినాక అతన్ని నేరుగా క్రైస్తవ సమాజంలో చేర్చుకోలేదు. డమస్కు క్రైస్తవ సమాజంలో పేరెన్నికగన్న అననీయాను అతని వద్దకు పంపాడు. పౌలుకు జ్ఞానస్నానమిచ్చింది ఈ భక్తుడే - ఆ.చ. 9, 17-19. అనగా పౌలు అననీయా అధికారాన్ని గుర్తించాలి. తొలినాటి సమాజంలో క్రైస్తవులు మోషే ధర్మశాస్తాన్నిపాటించాలా అక్కరలేదా అన్న వివాదం వచ్చింది. కొందరు పాటించాలని వాదించారు. పౌలు పాటించనక్కర లేదన్నాడు. మనలను రక్షించేది మోషే ధర్మశాస్త్రం గాదు, క్రీస్తునందలి విశ్వాసం అని బోధించాడు. కాని అతడు యెరూషలేము వెళ్లి అక్కడ వున్న పేత్రు యాకోబు మొదలైన భక్తులను కలుసుకొని తన వాదాన్ని విన్పించాడు. వాళ్ల అంగీకారాన్ని పొందాడు - అచ 15,1-3. ఈ సన్నివేశాలను బట్టి మనం క్రైస్తవ సమాజాధికారులకు లోబడి వున్నపుడు మాత్రమే దైవాత్మచే నడిపింపబడుతున్నామనే నిర్ధారణకు రావచ్చునని రూఢమౌతుంది గదా!

7. క్రీస్తు బోధలు

29. క్రీస్తుని పరిశుద్ధాత్మ ఎడారికి తోడ్కొని పోయింది. ఎందుకు? పిశాచం అతన్ని శోధించేందుకు - మత్త 4, 1. ఈ విధంగా ఓ వైపు పరిశుద్దాత్మా మరోవైపు దుష్ణాత్మా మనలను ప్రభావితం చేస్తూంటాయి. ఇక, దుష్ణాత్మ ప్రభుని ముమ్మారు శోధించింది. మొదట రాళ్లను రొట్టెలుగా మార్చమంది. అటుతరువాత దేవాలయ గోపురం విూది నుండి క్రిందికి దుమకమంది. అటుపిమ్మట చాగిలపడి తన్ను ఆరాధించమంది. ఈ మూడు శోధనల్లోని ముఖ్యాంశం, క్రీస్తు తండ్రి చిత్తాన్ని విూరేలా చేయడమే. కాని ఈ శోధనల్లో ప్రభువు పిశాచానికి లొంగిపోలేదు గదా, దాన్ని జయించాడు. ఐనా పిశాచం క్రీస్తుని అంతటితో వదలిపెట్టలేదు. పేత్రు ద్వారా మళ్ళా ప్రభువుని శోధించింది. అందుకే ప్రభువు పేత్రుని "సైతానూ! నా యెదుటి నుండి తొలగిపో" అని గద్దించాడు - మత్త 16,23. పిశాచం మనలను శోధించే తీరుగూడ ఈలాగే వుంటుంది.

30. క్రీస్తు బోధల్లో సదసదాత్మలను గుర్తుపట్టడానికి ఉపయోగపడే అంశాలు కొన్ని ఉన్నాయి. ప్రభువు ఇద్దరు యజమానులకు సేవచేయ వద్దన్నాడు - మత్త 6,24 ఈ యిద్దరు యజమానులు ఎవరు? భగవంతుడూ పిశాచమూను. మనం పూర్తిగా పిశాచం వైపు పోము. దేవుని సేవిస్తూనే వుంటాం. కాని పూర్తిగా దేవుని వైపు గూడ పోము. ఓ వైపు దేవుని ఆజ్ఞలు పాటిస్తూనే వుంటాం. మరోవైపు పిశాచంతో కూడ చేతులు • కలుపుతూంటాం. దాని చెప్పచేతలకు గూడ లొంగిపోతూంటాం. ఈ సంగతి మనకు తెలుసు. ఐనా స్వార్థం కొద్దీ గడ్డి తింటూంటూం, యూదా క్రీస్తునీ కోరుకున్నాడు ధనాన్నీ