పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 276 P.pdf/182

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆయా నిర్ణయాలు చేసికోగూడదని నిశ్చయించుకొన్నాడు. అన్ని పనుల్లోను ఆ ప్రభువు మనస్తత్వమే మనకూ వుండాలని బోధించాడు ఫిలి 2,5. ఈ పౌలు లాగే మనం కూడ భగవత్ర్పబోధం గుర్తించలేక జీవితంలో చాలాసారులు పొరపాటులు చేస్తుంటాం.

27. బైబులు భక్తులు భగవంతుడు తమ్ము నడిపించాలని ప్రార్థించారు. కీర్తనకారుడు తన యిక్కట్టులలో దేవాలయానికి వెళ్లి ప్రభుని సంప్రతించి చూడాలని కోరుకొన్నాడు–27,4. రిబ్కా తన గర్భంలోని కవలపిల్లలు ఒకరినొకరు నెట్టుకొంటూండగా చూచి ప్రభుని సంప్రతించింది - ఆది 25,22. దావీదు తన ఆపదల్లో ప్రభుని సంప్రతించి చూచేవాడు. ప్రభువు సలహా ప్రకారం ప్రవర్తించేవాడు. ప్రవక్తలు తాము దైవ సందేశాన్ని విన్పింపకముందు ప్రభుని సంప్రతించేవాళ్లు, నూత్న వేదంలో పౌలు దైవచిత్తాన్ని తెలిసికోవడానికై పలుసారులు ప్రార్థన చేసాడు - కొలో 1,9. డమస్కును త్రోవలో ప్రభుప్రకాశం పౌలును నేల విూద కూలద్రోయగా అతడు “ప్రభో నేనేమి చేయాలో తెలియజేయి" అని ప్రార్థించాడు - అచ 22,10. ఈలాగే మనంకూడ భగవంతుడు మనలను నడిపించాలని ప్రార్థించాలి. మనం పిశాచం కపటోపాయాలకు లొంగిపోకుండా వండాలనీ, దేవుని చిత్తప్రకారం జీవించాలనీ అడుగుకొంటూండాలి. 27ఎ. భగవంతుడు నరుల హృదయాల్లో మాటలాడుతూంటాడు. కీర్తనలు వ్రాసిన భక్తులకు ఈ యనుభవం బాగా వుంది."నీయాలోచనలతో నన్ను నడిపిస్తుంటావు, కడన నన్నునీ మహిమలో చేర్చుకొంటావు" అన్నాడు ఓ కీర్తనకారుడు-73,24. మనకు మంచి ఆలోచనలు పట్టించేదీ, మనచేత మంచిపనులు చేయించేదీ, వాటికి సంభావన ఇచ్చేదీ ప్రభువే "ప్రభువు నాకు హితోపదేశం చేస్తుంటాడు, రాత్రుల్లో గూడ అంతరాత్మ నన్ను హెచ్చరిస్తుంటుంది" అన్నాడు మరో భక్తుడు-16.7. భగవంతుడు తన భక్తులకు మేల్కొని వున్నపుడే గాదు నిద్రబోతున్నపుడు గూడ నడిపిస్తూంటాడు. యెషయా ప్రవచనం 54, 13. " మి బిడ్డలందరికీ ప్రభువే ఉపదేశం చేస్తాడు" అని చెప్తుంది. ఈ వాక్యాలను బట్టి ప్రభువు తన భక్తుల హృదయాల్లో మాటలాడుతుంటాడనీ, తన ప్రబోధం ద్వారా వాళ్లను నడిపిస్తుంటాడనీ, వ్యక్తమౌతుంది గదా! కాని ప్రభువు నరులు మాటలాడినట్లుగా పెద్దగా మాటలాడడు. అతడు తిన్నని యెలుగుతో మన హృదయంలో మాటలాడతాడు. ఆ ప్రభుస్వరం ఆధ్యాత్మిక మానవులకే గాని విన్పించదు. ప్రాపంచిక సుఖభోగాలతో సృష్టి వస్తులంపటత్వంతో సతమతమయ్యే వాళ్లకి ఆ ప్రభుస్వరం విన్పించనే విన్పించదు. కనుక మనం తరచుగా హృదయంలోనికి తొంగిచూచుకొని అక్కడ ప్రభువేమైనా ఉపదేశం చేస్తున్నాడా అని పరిశీలించి చూచుకోవాలి. భక్తులకు ఈలాంటి అలవాటు ఉంటుంది.