పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 276 P.pdf/177

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఇవి అబ్చిన తరువాత వీటినుండి గర్వాన్ని పుట్టిస్తుంది. వీటినుండి కలుగగూడని అవలక్షణాలన్నీ కలుగుతూయి. ఈ పిశాచ వాంఛలకు వ్యతిరేకంగా సదాత్మ మనలో ఆత్మనిగ్రహమూ, ధనం విూద అత్యాశపెట్టుకోకుండా వుండడమూ, గొప్ప పేరు సంపాదించు కొందామనే లోభానికి లొంగకుండా వుండడమూ, వినయమూ, దేవుని విూద ఆధారపడి జీవించడమూ మొదలైన సదుణాలను కలిగిస్తుంది. కనుక మనలో వుండే కోరికలనూ, ఆ కోరికలను సాధించడానికై మనం చేసే పనులనూ బట్టి కూడ ఏయాత్మ మనలను నడిపిస్తుందో తెలిసికోవచ్చు.

16. నాలుకకు రుచిగా వుండే అన్న పానీయాలు, చెవికింపుగా వుండే ముచ్చటలూ, కంటికింపగా వుండే వ్యక్తులూ, దృశ్యాలూ, స్పర్శ సుఖాలూ - ఈలాంటివన్నీ యింద్రియ సుఖభోగాలు. ఈ సుఖాలు అనుభవించిన మొదటిరోజుల్లో ఆనందాన్నీ ఉత్సాహాన్నీ కలిగిస్తాయి. కాని కడన నిరాశనూ అసంతృప్తినీ తెచ్చిపెడతాయి. ఇక ఆత్మ సంబంధమైన కార్యాలు అనగా ప్రార్థనమూ, ఆత్మనిగ్రహమూ, బైబులు పఠనమూ, దైవసేవా, సోదరప్రేమా, పవిత్ర జీవితమూ మొదలైనవి మొదట కష్టంగాను అనిష్టంగాను వుంటాయి. కాని అభ్యాసం చేసేకొలది గొప్ప ఆనందాన్నీ సంతృప్తినీ ప్రసాదిస్తాయి. బైబులు గ్రంథం రెండు త్రోవలున్నాయని చెప్మంది - మత్త 7,13-14. మొదటి త్రోవ విశాలమైంది. దానిలో ప్రయాణం చేయడం సుకరమనుకొని చాలమంది మోసపోతారు. కాని అది వినాశానికి చేరుస్తుంది. రెండవ త్రోవ ఇరుకైంది. ఆ త్రోవలో ప్రయాణం చేయడం కష్టమనుకొని చాలమంది దాన్ని అనుసరించరు. కాని కడన భగవంతుణ్ణి చేర్చే మార్గం అదే కనుక మనం ఇంద్రియ సుఖభోగాలను వెదుకుతుంటే పైన చెప్పిన విశాల మార్గంలో ప్రయాణం చేస్తున్నట్లు, ఆధ్యాత్మిక సుఖాలను వెదుకుతుంటే ఇరుకైన మార్గంలో వ్రపయాణం చేస్తున్నట్లు, మనలను విశాల మార్గంలో నడిపించేది దుష్టాత్మ ఇరుకుమార్గంలో నడిపించేది పరిశుద్దాత్మ

17. మనలో రెండు రకాల శక్తులున్నాయి. మొదటి రకం శక్తులు ఆత్మకు సంబంధించినవి. ఇవి బుద్ధిశక్తి చిత్తశక్తిని. బుద్ధిశక్తితో విషయాలు తెలిసికొంటాం. ఆలోచించిచూస్తాం. సత్యం గ్రహిస్తాం. చిత్తశక్తితో కార్యానికి పూనుకొంటాం, స్వాతంత్ర్యం నెరపుతాం, ప్రేమిస్తాం. ఈ శక్తులు ఉన్నతశక్తులు. ఇక రెండవరకం శక్తులు మన యింద్రియాలకు సంబంధించినవి. ఇవి మన పంచేంద్రియాలూ, సుఖదుఃఖాది మనోభావాలూ, జ్ఞాపకశక్తి మొదలైనవి. ఇవి అల్పశక్తులు. మొదటి కోవకు చెందిన ఉన్నత శక్తుల విూద నేరుగా దేవుడు మాత్రమే పనిచేయగలడు. అనగా మన బుద్ధిశక్తినీ చిత్తశక్తినీ నేరుగా భగవంతుడు మాత్రమే ముట్టగలడు. పిశాచాలు గాని దేవదూతలు గాని నేరుగా వాటి విూద ప్రభావం జూపలేవు. కాని ఈ పిశాచాలూ దేవదూతలూ నేరుగా మన అల్పశక్తులను ముట్టగలవు. అవి ప్రత్యక్షంగా మన యింద్రియ శక్తులమిద పనిచేసి వాని 169