పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 276 P.pdf/178

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వారా పరోక్షంగా ఆత్మశక్తులను ప్రభావితం జేయగలవు. పిశాచం తరచుగా పంచేంద్రియాల ద్వారా మనలను శోధిస్తుంది. చూపు, వినికిడి, స్పర్శ, రుచి, వాసన మొదలైన క్రియలకు కారణమైన కన్ను, చెవి, చర్మము, నాలుక, ముక్కు పంచేంద్రియాలు. కనుక మనం ఈ యవయవాల విషయంలో నిర్మలంగా వుండి శోధనల్లో చిక్కుకోకుండా వుండాలి.

18. నరుల్లో కొద్దిమందికి సున్నితమైన మనసాక్షి వుంటుంది. ఈలాంటి వాళ్ళ తప్పు చేయకపోయినా చేసామేమోననీ, స్వల్ప పాపం చేసినా చావైన పాపం చేసామోమోననీ బాధపడుతుంటారు. పిశాచం వీళ్లను బాధింపగోరి వీళ్ల మనస్సాక్షిని ఇంకా సున్నితం చేస్తుంది. పాపం చేయకపోయినా చేసామోమోననే శంకలూ బాధలూ అనుమానాలూ కలిగిస్తుంది. ఈ విధంగా వాళ్ల చిత్తశాంతిని పాడుచేస్తుంది. ఐనా ఈ యపాయానికి గురయ్యేవాళ్ల కొద్దిమంది. ఇక, నరుల్లో చాలమందికి మొద్దువారిన మనస్తత్వం వుంటుంది. ఈలాంటివాళ్లు తప్పచేసి కూడ చేయలేదన్నట్లుగా ధీమాగా వుండిపోతుంటారు. పిశాచం వీళ్ల మనస్సాక్షి మరింత బండవారిపోయేలా చేస్తుంది. వీళ్లు చావవైన పాపం చేసినపుడు స్వల్ప పాపమేలే అని అనుకొనేలాగా, స్వల్ప పాపం చేసినపుడు అసలది పాపమే కాదులే అని అనుకొనేలా చేస్తుంది. కనుక మొద్దువారిన మనస్సాక్షికలవాళ్లు జాగ్రత్తగా ప్రవర్తించాలి. కొంతవరకైన సున్నితమైన అంతరాత్మను అలవరచుకొనే ప్రయత్నం చేయాలి.

5. ఇగ్నేప్యసు అనుభవాలు

19. ఇగ్నేప్యస్ పరిశుద్దాత్మ అపరిశుద్దాత్మ నరులను నడిపించే తీరు క్షుణ్ణంగా అవగాహనం చేసకొన్నవాడని ముందే చెప్పాం, అతని జీవితంలో ఇందుకు చాలా ఉదాహరణలు కన్పిస్తాయి. అతడు ఇంకా పరివర్తనం చెందకముందే పాంపలూనా యుద్ధంలో సైనికాధికారిగా పోరాడి గాయపడి ఆస్పత్రిలో చేరాడు. అచట కాలవ్యాపనానికని అతనికి అర్యశిష్ణుల చరిత్రలు కొన్ని తెచ్చియిచ్చారు. అవి ఫ్రాన్సిసు, డోమినికు మొదలైన మహాభక్తుల చరిత్రలు. ఈ గ్రంథాలు చదువుతుంటే ఇగ్నేప్యస్కు రెండు రకాల తలంపులు కలిగేవి. ఒకరకం తలపులు తన ప్రాత జీవితానికి సంబంధించినవి. తాను పెద్ద సైనికోద్యోగిగా పేరుగాంచి రాజును మెప్పించాలి, రాజవంశానికి చెందిన ఓ అందగత్తెను వివాహమాడాలి. కాని ఈలాంటి తలంపులు వచ్చి దాటిపోయాక అతని హృదయంలో ఓ రకమైన అశాంతీ నిరుత్సాహమూ విచారమూ గోచరించేవి. మరోరకం తలంపులు తాను చదువుతున్నఅర్యశిష్ణుల చరిత్రలను పరస్కరించుకొని కలిగేవి. డోమినికూ ఫ్రాన్సిసూ అన్ని పుణ్యకార్యాలు చేసినపుడు తాను మాత్రం ఎందుకు చేయగూడదు? వాళ్లు భగవంతునికీ తోడిప్రజలకీ అంతగా సేవ చేసినపుడు తాను మాత్రం ఎందుకు చేయకూడదు? ఈలాంటి తలంపులు వచ్చి దాటిపోయాక అతని హృదయంలో ఓ రకమైన శాంతీ ఆనందమూ 170