పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 276 P.pdf/159

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అప్పడు ప్రభువు ఈ దేశంలో
మిగిలివున్న ప్రజలనైనా కరుణిస్తాడు" - 5 :14-15

ఇంకా యెషయా ఈలా అన్నాడు న్యాయాధిపతులతో :
"మీరు డబ్బు తీసికొని దుర్మార్గులను వదలివేస్తున్నారు
సన్మార్డులకు న్యాయం చెరుస్తున్నారు" - 5:23.

ఈలా ధర్మశాస్త్రమూ ప్రవక్తలూకూడ న్యాయాధిపతులు సాంఘిక న్యాయాన్ని పాటించాలని ఉదోషించారు.

2. రాజులు

న్యాయాధిపతుల తర్వాత న్యాయాన్ని కాపాడవలసినవాళ్లు విశేషంగా రాజులు. యిర్మీయాప్రవక్త రాజులనుగూర్చి ఈలా పలికాడు : "ప్రభువునైన నా యాజ్ఞ యిది. మీరు నీతి నియమాలను పాటించండి. దోపిడిచేసేవాడి చేతుల్లోనుండి పేదవాణ్ణి కాపాడండి పరదేసులనూ అనాథులనూ విధవలనూ పీడించనూవద్దు బాధించనూవద్దు. ఈ పవిత్ర స్థలంలో నిరపరాధుల నెత్తురు చిందింపవద్దు. మీరు నా యాజ్ఞలు పాటిస్తే అప్పడు దావీదు వంశీయులు రాజులుగా కొనసాగుతారు. వాళ్ళ తమ అధికారులతోను ప్రజలతోను గలసి రాజప్రాసాద ద్వారంగుండా గుర్రాలమీదా రథాలమీదా పయనిస్తారు. కాని మీరు నా మాట పాటించపోతే ఈ ప్రాసాదం సర్వనాశమౌతుంది. ఇది ప్రభువునైన నా పలుకు" - 22:3–5.

కాని చాలమంది రాజులు సాంఘిక న్యాయాన్ని లెక్కచేయకుండా దరిద్రులను పీడించారు. అలాంటి రాజుల్లో ఒకడైన యొయాకిమును యిర్మీయా ఈలా మందలించాడు:

"అన్యాయాలతో మేడకట్టించేవాడు
అక్రమాలతో మీదిగదులు నిర్మించుకొనేవాడు
తోడి జనంతో ఊరికే చాకిరి చేయించుకొని
కూలి ఎగగొట్టేవాడు, సర్వనాశమైపోతాడు
నీ దృష్టినీ కోరికా యెప్పడూ స్వార్ధలాభంమీదనే
నీవు నిరపరాధుల నెత్తురు ఒలికించావు
ప్రజలను పీడించి పిప్పిచేసావు" - 22:13-18

ఈలాంటి దుర్మార్గపు పనులుచేసి దరిద్రులకు అన్యాయం చేసిన రాజులు ఇంకా ఎంతోమంది వున్నారు.